పెళ్లి చేసుకోను అన్నందుకు యువతిని నమ్మించి దారుణ హత్య
వనపర్తి: 25 రోజుల తరువాత వెలుగులోకి ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోనని చెప్పినందుకు ఆమెపై పగపట్టి నమ్మించి హత్య చేసిన సంఘటన వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలంలోని మానాజీ పేట గ్రామంలో జరిగింది.కొత్తకోట సీఐ శ్రీనివాస్ రెడ్డి కథనం ప్రకారం హైదరాబాద్ లోని కాటేదాన్ కు చెందిన సాయి ప్రియ (19)కు మానాజీ పేట గ్రామానికి చెందిన బత్తుల శ్రీశైలం యాదవ్ తో పరిచయం ప్రేమగా మారింది.
ఇద్దరి పెళ్లి కి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇంకా పెళ్ళి జరగదని భావించి దూరం అయ్యారు.సంవత్సరం తరువాత శ్రీశైలం యాదవ్ మళ్ళీ సాయి ప్రియతో ఫోన్ లో చాటింగ్ ప్రారంభించాడు.ఇదే చనువుగా తనను కలిసేందుకు ఒక సారి రావాలని, లేకుంటే చచ్చి పోతానని బెదిరించడంతో సాయి ప్రియ గత నెల 15న కాటేదాన్ నుంచి భూత్పూరు వరకు రాగా అక్కడి నుంచి శ్రీశైలం ఆమెను తన స్వంత గ్రామానికి తీసుకుని వెళ్ళి చాల సేపు ఒంటరిగా పొలాలలో గడిపారు.ఈ సందర్భంగా తనను పల్లెటూరికి మనువు ఇవ్వాలనీ ఆశలు పెట్టుకోవద్దని సాయి ప్రియ తేల్చి చెప్పింది.
చీకటి పడటంతో తాను వెళతానని సాయి ప్రియ కోరగా అందుకు శ్రీశైలం ఒప్పుకోలేదు.ఇద్దరి మధ్య గొడవ జరిగింది.ఈ సమయంలో తనను పెళ్ళి చేసుకోకుంటే నిన్ను చంపేస్తానంటూ ఆమె చున్నీతో ఉరి వేసి చంపేశాడు.ఆ తరువాత తన స్నేహితుడు శివతో కలిసి శవాన్ని పూడ్చి పెట్టాడు.తన కూతురు కనిపించటం లేదని సాయి ప్రియ తల్లిదండ్రులు కాటేదాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.విచారణ జరపడంతో నేరం బయట పడింది.గురువారం శ్రీశైలం ను అరెస్టు చేసి శవాన్ని వెలికి తీసిన కాటేదాన్ పోలీసులు పంచనామా చేసి శవాన్ని బంధువులకు అప్పగించారు