నవంబర్ 11 నుంచి దక్షిణ కోస్తాంధ్రలో పెరగనున్న వర్షాల జోరు
అత్యధిక వర్షాలు తిరుపతి, నెల్లూరు జిల్లాల మీదుగానే ఉంటుంది. అందులోనూ నవంబర్ 11, 12 మరియు 13 తేదీలల్లోనే భారీ వర్షాలు విస్తారంగా ఉంటుంది. నవంబర్ 11 న తిరుపతి, నెల్లూరు జిల్లాల మీదుగానే పూర్తి వర్షపాతం ఉంటుంది. అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్ని చోట్లల్లో అతిభారీ వర్షాలను కూడ మనం చూడగలము.
నవంబర్ 12 నుంచి ప్రభావం తిరుపతి, నెల్లూరు జిల్లాలతో పాటుగా కడప, అన్నమయ్య, చిత్తూరు, బాపట్ల జిల్లా (కోస్తా భాగాలు మాత్రమే), ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల మీదుగా ఉండనుంది.నవంబర్ 13 కూడ అక్కడక్కడ భారీ వర్షాలు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల మీదుగా ఉంటుంది. ఆ సమయానికి అల్పపీడనంగా బలహీనపడి అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతంలో ఉన్న తేమను లాగుతుంది. కాబట్టి వర్షాలు నవంబర్ 13 న భారీగా ఉంటుంది.
నవంబర్ 14 నుంచి వర్షాలు క్రమ క్రమంగా మనం పై మిద్దె నుంచి కిందకు ఎలా మెట్ల సాయంతో దిగుతామో అలా నవంబర్ 14 నుంచి 16 కి వెళ్లేసరికి వర్షాలు భాగా తగ్గుముఖం పట్టనుంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో తక్కువగా వర్షాలుంటాయి. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మాత్రం తేలికపాటి తుంపర్లు, కొద్ది సేపు వర్షాలు మాత్రమే మనం నవంబర్ 12 నుంచి 16 మధ్యలో చూడగలము. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండవు. ఇక మనం అందరం మా ఊరిలో వర్షాలు పడుతాయా అనే బదులు, ఏ ఏ జిల్లాలను చెప్పడం జరిగిందో వారు వర్షాలకు సిద్ధం అవ్వండి.
వైజాగ్, విజయవాడల మీద ప్రభావం ?
ఈ అల్పపీడనం వలన దక్షిణ కోస్తాంధ్ర మీదుగానే ప్రభావం ఉంటుందే కానీ ముఖ్య నగరాలైన వైజాగ్, విజయవాడకి ఏ ప్రభావం ఉండకపోవచ్చు. నవంబర్ 12 నుంచి 15 మధ్యలో కొన్ని తేలికపాటి వర్షాలు, మేఘావృతమైన ఆకాశం ముఖ్యంగా విజయవాడలో చూసే అవకాశాలున్నాయి. అంతేకానీ ఈ రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలుండవు.