జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వీడియో పోస్ట్ చేశారు.
“మనల్ని పరిపాలించిన రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం మొత్తం దేశానికి భారతీయ సంతతికి చెందిన రుషి సునాక్ ప్రధాన మంత్రి అవగలిగే పరిస్థితులు ఉన్నప్పుడు… ఇక్కడ ఇంకా.. ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం ఉన్న వ్యక్తులు మిగతా వాళ్లను ఎందుకు రానివ్వరు? ఎంత కాలం రానివ్వకుండా ఉంటారు. భారత దేశం స్వతంత్రం సంపాదించుకుని మనం చేసిన అద్భుతం ఏంటంటే- పంచాయితీ ఎన్నికల్లో అణగారిన వర్గానికి చెందిన ఒకరు స్వేచ్ఛగా నేను నామినేషన్ వేద్దాం ఓట్లు వచ్చినా రాకున్నా అనుకొనే పరిస్థితి లేదు. దీని గురించి ఏమనాలి? బ్రిటీష్ వాడు వదిలి వెళ్లిపోయినా ఇంకా ఊడిగం ఎవరికి చేస్తాం. నామినేషన్ వేసే అర్హత కూడా నీకు లేదని భయపెట్టేస్తుంటే దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి. ఫ్యూడలిస్టిక్ కోటల్ని బద్దలు కొట్టక తప్పదు… ఏ రోజా అని ఎదురుచూస్తున్నా.”