Suryaa.co.in

Andhra Pradesh

అంగన్‌వాడీలలో జులై1 నుండి పాలు, గ్రుడ్డుతో సహా మధ్యాహ్న భోజనం

– మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలు డాక్టర్ సిరి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలలో గర్బిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు వండిన అహారాన్ని వేడిగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలు డాక్టర్ సిరి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55607 అంగన్‌వాడీ కేంద్రాలలో జూలై ఒకటి నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు.

కరోనా వ్యాప్తి నేపధ్యంలో 2020 మార్చి నెలలో వండిన ఆహారాన్ని అందించే కార్యక్రమాన్ని నిలిపి వేయగా, ప్రస్తుతం ఆ కార్యక్రమాన్ని తిరిగి పున: ప్రారంభిస్తున్నామని వివరించారు. తల్లులకు ఇంటి వద్దనే పోషకాహార సామాగ్రిని అందించే కార్యక్రమం జూన్ 30 వరకు కొనసాగుతుందని డాక్టర్ సిరి పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో 3-6 సంవత్సరాల వయస్సు గల ప్రీ-స్కూల్ పిల్లలకు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు గుడ్డు, పాలతో సహా వేడి వేడి భోజనాన్ని అందిస్తామన్నారు.

రాష్ట్రంలో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించే ధ్యేయంతో ముఖ్యమంత్రి మానసపుత్రికగా ప్రభుత్వం గర్భిణీ, పాలిచ్చే తల్లులు, 6 నుండి 72 నెలల పిల్లల కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను అమలు చేస్తోందని డాక్టర్ సిరి తెలిపారు.

LEAVE A RESPONSE