విజయవాడ: రాష్ట్ర సమాచార కేంద్రంలో సహాయ సంచాలకులుగా విధులు నిర్వహిస్తూ పదోన్నతి పై సి ఆర్ మీడియా అకాడమీ లో శుక్రవారం డిప్యూటీ డైరెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగినది. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ ఆలపాటి సురేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
పదవి బాధ్యతలు స్వీకరించిన ఎం భాస్కర్ నారాయణ ను సి ఆర్ మీడియా సెక్రెటరీ వి. మణిరాం, అకౌంట్ ఆఫీసర్ శాంతారాం, లైబ్రేరియన్ వి. శేఖర్, జూనియర్ అసిస్టెంట్ లవ రాజు, ఆదిత్య అభినందించారు.