– పరీక్షనే రద్దు చేయాలని హైకోర్టు చెప్పినా రాష్ట్ర బీజేపీ కిమ్మనదు
– ఎక్స్ వేదికగా రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
హైదరాబాద్: ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల నగరంలో నిన్న ఒక చిన్నారి తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడిపోయింది.. అదృష్టవశాత్తూ పాప ప్రాణాలు దక్కాయి. చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోని మూడు విభాగాలేమో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.
తప్పు హైడ్రాది అని జీహెచ్ఎంసీ ప్రకటిస్తే, తప్పు మాది కాదు జలమండలిది అని హైడ్రా చేతులు దులుపుకుంది. . ఆ వెంటనే అసలు మాకేం సంబంధం లేదని జలమండలి చేతులెత్తేసింది! మున్సిపల్ శాఖను కేవలం కాసుల వేటకు వాడుకోవడంలో రేవంత్ బిజీగా ఉంటే, ఆయన శాఖలోని విభాగాలేమో సమన్వయలేమితో నగరవాసులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి..
చోటే భాయ్‌కి చీమ కూడా కుట్టకుండా పహారా కాస్తున్న బడే భాయ్ పార్టీ బీజేపీ!
రాష్ట్ర ప్రజలకు ఎన్ని సమస్యలొచ్చినా రేవంత్ ఎన్ని స్కాములకు పాల్పడినా బీజేపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటది.. గ్రూప్ 1 నిర్వహణలో ఘోరమైన అవకతవకలు జరిగి ఏకంగా పరీక్షనే రద్దు చేయాలని హైకోర్టు చెప్పినా రాష్ట్ర బీజేపీ కిమ్మనదు.
విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం చేసిన నేరపూరిత నిర్లక్ష్యం మీద డబ్బులకు జాబులు అమ్ముకున్నారన్న ఆరోపణల మీద బీజేపీ మౌనానికి కారణమేంది?
బీఆర్ఎస్ హయాంలో ప్రతిదానికీ సీబీఐ ఎంక్వైరీ అని ఒంటికాలి మీద లేచిన బీజేపీ నేతలు గ్రూప్ 1 స్కాం మీద అదే విచారణ ఎందుకు కోరడం లేదు? రేవంత్-బీజేపీల రహస్య మైత్రికి ఇది తాజా ఉదాహరణ మాత్రమే!