(మన పాఠ్య పుస్తకాల్లోని…పొద్దున్నే లేచాడు మా మామ అనే rhyme లో చదవగలరు.)
పొద్దున్నే వచ్చాడు మా సారు
సెల్లు ఫోను తీశాడు మా సారు
బాత్రూంలో దూరాడు మా సారు
ఫోటోలెన్నో తీసాడు మా సారు
అప్లోడ్ చేశాడు మా సారు
క్లాసులోకి వచ్చాడు మా సారు
సెల్లు ఫోను తీశాడు మా సారు
హాజరు యాప్ నొక్కాడు మా సారు
సిగ్నలే లేదంటూ బయటికెళ్ళాడు
సబ్మిట్ అయిందని సంతోషపడ్డాడు
మళ్ళొచ్చి కూర్చున్నాడు మా సారు
బీరువా తెరిచాడు మా సారు
బట్టలు, బూట్లు తీశాడు మా సారు
వలంటీరుకి ఫోన్ చేసి మా సారు
బయోమెట్రిక్ అడిగాడు మా సారు.
ఫోనుకే గుచ్చాడు మా సారు.
థంబ్ లేయించాడు మా సారు.
నా థంబ్ పడలేదని చిరాకుపడ్డాడు.
మీ అమ్మను పిలవమని వెళ్ళతోలాడు
మాయమ్మ పనికెళ్ళే, నేనేమి చెప్పాలి. బిక్కమొగం వేశాను బిక్కుబిక్కుమంటూ చిర్రుబుర్రులాడాడు మా సారు. నెత్తి గోక్కుంటూ
మధ్యాహ్నం అయింది
అన్నం బెల్లు మోగింది.
మళ్ళా సెల్లు తీశాడు మా సారు
టిక్కు టిక్కు నొక్కాడు మా సారు.
ఫోటోలు తీశాడు మా సారు.
క్లాసులోకి వచ్చాడు మా సారు.
మళ్ళీ సెల్లు ఫోను టింగుమంది.
ఉలిక్కిపడ్డాడు మా సారు.
అర్జoటు మెసేజులు,
ఆన్లైను చెయ్యాలి,
అడ్మిషన్లు ఎక్కించాలి.
udiseలు కొట్టాలి.
నాడు – నేడు నెట్టాలి.
అంతులేని కథలో మా సారు.
నడి సముద్రం ఈదుతూ మా సారు ఏమైపోతడో మా సారు