Suryaa.co.in

Andhra Pradesh

మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు

– సీఐ వలిబసును వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు

మదనపల్లె: సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధంపై విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మదనపల్లె ఒకటో పట్టణ సీఐ వలిబసు విధులు సరిగా నిర్వహించలేదని గుర్తించిన అధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు. వలిబసును వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు.

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఐ సరిగా విధులు నిర్వహించలేదని గుర్తించిన అధికారులు సీఐ వలిబసుపై చర్యలు తీసుకున్నారు. ఒకటో పట్టణ సీఐ వలిబసును వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు.

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం ఘటనపై అన్నికోణాల్లో విచారణ ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్ పీవీ వెంకటరమణ, అధికారి అనిల్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విచారణలో డైరెక్టర్‌తో పాటు మదనపల్లె అగ్నిమాపక అధికారి శివప్ప కూడా పాల్గొన్నారు. డైరెక్టర్ అగ్నిప్రమాదం జరిగిన తీరు, విధానాలు సహా పలు అంశాలు అడిగి తెలుసుకున్నారు.

LEAVE A RESPONSE