Suryaa.co.in

National

అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు

ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేస్తూ కొండ ప్రాంతంలో వెళుతున్నాడు. కారు సరిగ్గా ఘాట్ రోడ్డు మధ్యలో ఉంది. ఏమాత్రం వెనక్కి జరిగినా కొండపై నుంచి కారు పడిపోయే ప్రమాదం. పోనీ యూటర్నీ తీసుకుందామా అంటే పక్కన కొండ. అయినా ఆ డ్రైవర్ తగ్గేదేలా అన్నట్లు కారును అదే చిన్న స్థలంలో యూటర్న్ చేసేందుకు ప్రయత్నించాడు. సాధారణంగా ఇది అసాధ్యం. ఎట్టి పరిస్థితుల్లో కారును యూటర్న్‌

చేయలేడు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు కాబట్టే ఇప్పుడా ఆ కారుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంత చిన్న రోడ్డులోనే కారును ముందుకు, వెనక్కి తిప్పుతూ ఎట్టకేలకు యూటర్న్ చేసుకొని దూసుకుపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడీయో చూసిన నెటిజన్లు ఆ డ్రైవర్ ట్యాలెంట్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. వీడియోను డౌన్‌లోడ్ చేసి వాట్సాప్‌లో స్టేటస్‌లా పెట్టుకుంటున్నారు.

LEAVE A RESPONSE