న్యూఢిల్లీ: బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించిన తర్వాత పీవీఎన్ మాధవ్ తొలిసారిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలిశారు. ఈ సందర్భంగా అమిత్ షాని శాలువతో సత్కరించి మొక్కను బహూకరించారు. అనంతరం అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం వివరించి, పార్టీ నుంచి బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మాధవ్ తెలిపారు.