– ఎమ్మెల్యేను ప్రశ్నిసే కేసు పెట్టి వేధిస్తారా?
– ఏపి మహిళా స్వచ్ఛాంధ్ర జాక్ అధ్యక్షురాలు మాధవి ఫైర్
గుంటూరు: ‘తన పెన్షన్ ఎందుకు నిలిపివేశారని ఎమ్మెల్యేను నిలదీసినందుకు ఒక మహిళపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం గొపద్పతనమా? మీ హీరోయిజం రోజువారీ కూలీ చేసుకునే మహిళలపైనే తప్ప, అక్రమ సారా వ్యాపారం చేస్తున్న అధికారపార్టీ నాయకులపై చూపించరా? వారిపై కేసులు పెట్టే
దమ్ములేదా? మహిళలమీదనా మీ అహంకారం? ఈ ప్రభుత్వం చివరికి మహిళల చేతిలోనే పతనమవుతుంద’ని ఏపి మహిళా స్వచ్ఛాంధ్ర జాక్ అధ్యక్షురాలు లంకా మాధవి హెచ్చరించారు.
గుంటూరులోని తన కార్యాలయంలో మాట్లాడిన ఆమె.. ఇటీవల తన పించను నిలిపివేసిన వైనంపై మాజీ డిప్యూటీ సీఎంను నిలదీసిన మహిళ, ఈ రాష్ట్రంలో మహిళాలోకానికి ఆదర్శంగా నిలిచారన్నారు. కూలీచేసుకుని జీవించే ఆమెకు పించను ఎందుకు నిలిపివేశారో చెప్పడం చేతకాని దద్దమ్మలు, చివరకు ఆమెపై కేసు పెట్టి, పోలీసుస్టేషన్ చుట్టూ తిప్పడం ఏం గొప్పతనం అని నిలదీశారు. ఎమ్మెల్యేకు దమ్ముంటే నిలిపివేసిన పెన్షన్‌ను తిరిగి ఆమెకు ఇప్పించాలే తప్ప, ఇలా దొడిడదోవన కేసులు పెట్టడమేమిటన్నారు. ఎమ్మెల్యేను ప్రశ్నించిన మహిళకు తాము అండగా నిలుస్తామన్నారు. మహిళలను వేధిస్తే తామే పోలీసులపై కేసులు పెడతామని మాధవి హెచ్చరించారు.