సీఎం వైయ‌స్ జగన్ ముందుచూపు వల్లే వరదల్లో ఒక్క ప్రాణనష్టం జరగలేదు

– బాబుకు అధికారం పోవడం వల్లే రామోజీకి పుట్టిన ఆకలి ఇది
– బాబు బురద రాజకీయానికి ఈనాడు, ఎల్లో మీడియా దుష్ట పన్నాగం
– రాజకీయంగా మునిగిపోయిన చంద్రబాబు, టీడీపీని రక్షించడానికి బరితెగించి రామోజీ రాతలు
– రాష్ట్ర చరిత్రలోనే మరే ప్రభుత్వం చేయనంతగా వరద విషయంలో అప్రమత్తత, సహాయక చర్యలు
– బాబు హయాంలో కరువే తప్ప ఈ స్థాయిలో వరద వచ్చింది లేదు
– సచివాలయాలు, వాలంటీర్ల నుంచి నూతన జిల్లాల వరకు.. ఇంత భారీ యంత్రాంగం ఎప్పుడూ లేదు
-మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు

జులై రెండో వారంలో గోదావరిలో ఇంత వరద రావడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేకపోయినా, ప్రభుత్వం అన్నివిధాలా అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టిందని మంత్రులు అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, పినిపె విశ్వరూప్ తదితరులు స్పష్టం చేశారు. ఎల్లో మీడియా అబద్ధాలు, అసలు నిజాలకు సంబంధించి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…

ఇంతగా వరద ముంచెత్తుతోందని తెలిసిన వెంటనే గ్రామాలను ఖాళీ చేయించటం, ప్రజల ప్రాణాలు రక్షించటం… ఇవీ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతలు. మునిగే ప్రాంతాలేవో ముందుగానే హెచ్చరించేందుకు, నివాసాలనుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు, శిబిరాలకు తరలించేందుకు ప్రభుత్వం చేసిన కృషి అందరికీ తెలుసు. గతానికి – ఇప్పటికి తేడా ఏమిటంటే… గతంలో ఇదే గోదావరి జిల్లాలకు ఉన్నది ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు జాయింట్‌ కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు మాత్రమే.

ఇప్పుడు రెండు జిల్లాలు ఆరు జిల్లాలయ్యాయి. ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు ఎస్పీలు, ఆరుగురు జేసీలు, వీరి కింద ఉండే యంత్రాంగం… వీరంతా పై స్థాయిలో ఉంటూ అధికార యంత్రాంగం తరఫున వరద పరిస్థితిమీద కానివ్వండి, వరద బాధిత గ్రామాలను ఖాళీ చేయించి ప్రాణాలు కాపాడే విషయంలో కానివ్వండి… వరద బాధిత ప్రజలకు సహాయ సహకారాలు అందించే విషయంలో కానివ్వండి… ఇంతకు ముందు కంటే ఎంతో మిన్నగా పని చేస్తున్నారు.

మరో వంక, ప్రజా క్షేత్రం నుంచి వచ్చిన, ప్రభుత్వ ప్రతినిధులు అయిన ఎమ్మెల్యేలు, ఆ జిల్లాల్లో మంత్రులు, ఆ జిల్లాలకు ఇన్‌చార్జిలుగా ఉన్న మంత్రులు, వీరంతా రాత్రనక, పగలనక తమకు సంబంధించిన జిల్లాల్లో సహాయక చర్యల్ని అధికారులతో, ప్రభుత్వ యంత్రాంగంతో సమీక్షించి ఎక్కడికక్కడ చర్యలు తీసుకునేలా దగ్గరుండి పని జరిపించారు.

ఈ రెండు వ్యవస్థలకు తోడుగా… గ్రామ స్థాయిలో ప్రతి 50 ఇళ్ళకు ఒకరు చొప్పున మనందరి ప్రభుత్వం పెట్టిన వాలంటీర్‌ వ్యవస్థ కానివ్వండి… మనందరి ప్రభుత్వం పెట్టిన గ్రామ/ వార్డు సచివాలయ వ్యవస్థ కానివ్వండి… ఎక్కడికి అక్కడ పరిస్థితిని సమీక్షించి సహాయపడుతున్నారు.

రాష్ట్ర చరిత్రలోనే ఏ ప్రభుత్వమూ ఇంతగా వరద విషయంలో అప్రమత్తం కాలేదు. ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇంతగా… జులై లోనే వచ్చిన ఇంత భారీ వరదను, భద్రాచలంలో 70 అడుగులు దాటిపోయిన వరదను… 27 లక్షల క్యూసెక్కులకు పైగా పొంగిన గోదావరిని.. ఎదుర్కొని ఒక్క ప్రాణం కూడా పోవటానికి వీల్లేదని ఇలా కదిలింది లేదు. ఇదీ వాస్తవం. చంద్రబాబు నాయుడు హయాంలో కరువే తప్ప వరద, అదీ ఈ స్థాయి వరద వచ్చింది లేదు. ఆ రోజుల్లో ఇలాంటి మూడు–నాలుగు అంచల వ్యవస్థగానీ, ఇంత భారీగా జిల్లాలుగానీ, జిల్లా యంత్రాంగంగానీ, జిల్లాల మంత్రులుగానీ లేరు. వరదల్లో ఏ ఒక్క మనిషీ మరణించటానికి వీల్లేదని ఇంతగా పని చేసిన పరిస్థితి… ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. ఇదీ వాస్తవం.

మరి ఇవన్నీ వాస్తవాలు అయితే… ఒక చంద్రబాబు నాయుడు ఎలా బతకాలి?. అధికార పార్టీమీద రాజకీయం ఎలా చేయాలి? ఈ నెల 21న చంద్రబాబు, టీడీపీ బృందం వెళ్ళేసరికి… ప్రజల్లో ఎలా అపోహలు కలిగించాలి?. ‘‘ఏమీ అందలేదు’’ అని ఎలా చెప్పించాలి?. ఈ దుష్ట ఆలోచనలు చేయటానికి టీడీపీ తరఫున ‘ఈనాడు’ రెడీ అయింది. వరద బాధితుల్ని కాదు… రాజకీయంగా మునిగిపోయిన చంద్రబాబుని, తెలుగు దేశం పార్టీని రక్షించుకోవటం కోసం రామోజీ నడుం బిగించి… బరి తెగించి… అబద్ధాలు ఎలా రాస్తున్నాడో, ఎలా ఈటీవీ మైకులు పంపి… నలుగురైనా, మాకు ఏదీ అందలేదని చెప్పండి అని పడవల మీద వెళ్ళి మరీ తంటాలు పడుతున్నారో నాలుగు రోజులుగా చూస్తున్నాం.

ఈ దుర్మార్గపు ఆలోచనల్లో భాగంగానే ఈ రోజు ఈనాడులో ‘‘పెద్దలకు తిండి లేదు… పిల్లలకు పాల చుక్క లేదు…’’అంటూ చంద్రబాబు వచ్చినప్పుడు కొద్దిమంది అయినా ఏం మాట్లాడాలో ప్రిపేర్‌ చేయటానికి ఈ పేపర్‌ అనే చీడపురుగు సమాజం బుర్రలో విషం నింపటానికి రెడీ అయింది. ‘పెద్దలకు తిండి’అంటే తెలుగుదేశం పార్టీ పెద్దలైన ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 పెద్దలకు తిండి. పిల్లలకు పాల చుక్క అంటే లోకేశ్, పవన్‌ కల్యాణ్‌ బ్యాచ్‌కు పాల చుక్క అని అర్థం చేసుకోవాలి. ఇది అధికారం పోయి పుట్టిన ఆకలి.

నిజాలు ఏంటంటే…
వరద శిబిరాల్లో ఉన్న ప్రజలకు సహాయం అందించే విషయంలో ఎక్కడా అలసత్వం లేదు. ఇంతకు ముందే చెప్పినట్టు, చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని వరదల్ని… ఈ 75 ఏళ్ళ స్వాతంత్య్ర చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పునర్‌ నిర్మించుకున్న వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు మొదలు జిల్లాలు, కలెక్టర్ల వ్యవస్థ వరకు అంతా ఇంత భారీగా పని చేసిన మరో సందర్భం లేదు. పునరావాలస శిబిరాల్లోనుంచి వెళ్ళే ప్రజల కుటుంబాలకు రూ. 2000 ఇచ్చిన పరిస్థితి టీడీపీ హయాంలో ఏనాడూ లేదు.

టీడీపీ పాలనలో కరువే తప్ప, వర్షం, నీరు, వరద లాంటివి చంద్రబాబు మహిమ వల్ల ఏనాడూ లేవు. పైగా, చేతగాని వాడు పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందన్న సామెత మాదిరిగా… చంద్రబాబు కట్టిన పోలవరం కట్టడాలు 2019–20 వరదలకు కొట్టుకుపోయాయి. ఈ సారి అలాంటి పరిస్థితి రాకుండా, యుద్ధ ప్రాతిపదికన, కాఫర్‌ డ్యాం ఎత్తును మరో పెంచే కార్యక్రమం… ఇంత వరదల్లో ప్రారంభించి జగన్‌గారి ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. ఇది పత్రికల్లో రాయించుకునేందుకు, బాకా ఊదించుకునేందుకు కాదు… బాధ్యత కలిగిన ప్రభుత్వం చేసిన పని!

ఈ స్థాయి వరదే లేకపోయినా, ఈ రోజు ఈనాడులో ఏం రాశారంటే… అదే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడైతే… ఇలా వరదలు వచ్చినప్పుడు… పిల్లలందరికీ పాలు, బిస్కెట్‌ ప్యాకెట్లు; ఇంట్లో ఉన్నవారందరికీ భోజనం ప్యాకెట్లూ ఇచ్చేవారని ‘ఈనాడు’లో రాశారు. వరదను రాజకీయం చేయటంలో చంద్రబాబు కంటే తాము ముందుంటామని; అబద్ధాల ఫ్యాక్టరీ నడపటంలో దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానం తమదే అని చెప్పటానికి ఇలాంటి తప్పుడు రాతలు ఉదాహరణలుగా నిలుస్తాయి. పునరావాస కేంద్రాల్లో ఉన్నప్పుడు, అక్కడినుంచి వెనక్కు వెళుతున్నప్పుడు వరద బాధితులకు ఇచ్చే సహాయం గురించి టీడీపీ ఏనాడూ తన పాలనలో ఆలోచన చేసినదే లేదు. పునరావాస కేంద్రాల్లో ఇచ్చే పాలు, బిస్కెట్లు, భోజనం వంటి ప్రతి ఒక్క విషయంలో జగన్‌ ప్రభుత్వం మెరుగైన ఫోకస్‌ పెట్టింది.

ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకున్నాం
గతంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరి ఉగ్రరూపంలో వరద రావడం జరిగింది. ఈ వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముందుగానే ఎక్కడికక్కడ అధికారులను సమాయత్తంగా ఉండేలా అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్తగా ముంపు ప్రాంతాల వద్ద ప్రతిచోట క్యాంపులు ఏర్పాటు చేయించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. గోదావరికి ఇంత పెద్ద ఎత్తున వరద నీరు వచ్చినా ప్రభుత్వం ముందు చర్యల్లో భాగంగా అప్రమత్తమై సహాయక చర్యలు ముమ్మరం చేసి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చేసింది. అలాగే ఏటుగట్టలు బలహీనపడకుండా రాత్రింబవళ్లు శ్రమించడం జరిగింది.
గతంలో ఉభయ గోదావరి జిల్లాలకు ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు జాయింట్‌ కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు ఉండేవాళ్లు. అయితే జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో ఆరు జిల్లాలు కావడంతో.. ఆరుగురు జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఎస్పీలు అంతా సమిష్టిగా వరద ప్రభావిత జిల్లాల్లో పూర్తి అప్రమత్తంగా వ్యవహరించి బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టారు. వాలంటీరీ వ్యవస్థను తీసుకువచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు హేళనగా మాట్లాడారు. అలాంటి వాలంటీర్లతో పాటు సచివాలయ సిబ్బంది ఇవాళ బాధితులను ఆదుకోవడం జరిగింది.

నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం
ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్‌ఛార్జ్‌ మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఆదుకోవడంతో పాటు వారి సమస్యలను విన్నారు. ఇంత పకడ్బందీగా వరద సహాయక చర్యలు చేపట్టడం గతంలో ఎప్పుడూ చూడలేదు. ప్రతి జిల్లాకు కలెక్టర్ల వద్ద రూ.2కోట్ల సహాయ నిధిని ఉంచి, ముఖ్యమంత్రిగారు ఎప్పటికప్పుడూ వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహించారు. అలాగే వరద బాధితులకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్‌ పంపిణీ చేశాం.

వరదల సమయంలో బాబు ఏరియల్ సర్వేలు చేయలేదా?
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అనంతరం టెలి కాన్ఫరెన్స్‌లో సంబంధిత జిల్లాల అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏరియల్‌ సర్వే చేస్తే అయిపోతుందా అని విమర్శలు చేయడం సరికాదు. వరదల సమయంలో చంద్రబాబు నాయుడు కూడా ఏరియల్‌ సర్వేలు నిర్వహించలేదా? ఆ సమయంలో ఆయన ఫ్రూట్స్‌ తింటూ ఏరియల్‌ సర్వేను విహార యాత్రలా, పిల్లచేష్టల్లా చేపట్టలేదా?
కానీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రం ప్రతి విషయాన్ని ప్రజలకు దగ్గరగా ఉండేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా విపక్షాలు విమర్శలు చేయడం దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు ఏంచేసినా ఆయనకు మైలేజీ రావడం లేదు. టీడీపీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు కూడా మా సంక్షేమ పథకాలు అందటంతో ముఖ్యమంత్రి ప్రతి కుటుంబంలో, వారి సొంత బిడ్డలా అయిపోయారు. దాంతో చంద్రబాబుకు దిక్కుతోచడం లేదు. అందుకే ఇటువంటి అర్థం పర్థం లేని విమర్శలు.

రామోజీకి తిండి లేదా..?
ఈనాడు రామోజీరావు చంద్రబాబును భుజాన వేసుకుని పైకిలేపే ప్రయత్నం చేస్తున్నారు. ‘పిల్లలకు పాలచుక్క లేదు… పెద్దలకు తిండి లేదు’ అంటూ హెడ్డింగ్‌ పెట్టి ఓ వార్తను ప్రచురించారు. రామోజీరావుకు పెద్ద వయసు వచ్చి పెద్దవారు అయిపోయారు కానీ, వయసు పెరిగినకొద్దీ వారు పిల్ల చేష్టలు చేస్తున్నారు. ఎవరికి తిండి లేదు రామోజీరావుకా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, టీవీ5 బీఆర్‌ నాయుడుకు తిండి లేదు. నారా లోకేష్‌ నాయుడుకు, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌కు పాల చుక్కలు లేవు. రామోజీరావు అష్టకష్టాలు పడి చంద్రబాబును జాకీలు పెట్టి పైకి లేపాలని ప్రయత్నం చేస్తున్నా… తుప్పు పట్టి కిందకు దిగపోతోంది కానీ, ప్రయోజనం శూన్యంగా మారింది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజల మనిషి అయ్యారు. ప్రజల గుండెల్లో ఉన్నారు. ప్రతి కుటుంబానికి మామయ్య, అన్నయ్య, తమ్ముడిగా, కుటుంబసభ్యుడిగా అండగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు పాలనతో విసిగిపోయిన జనం వైఎస్‌ జగన్‌కి అధికారం ఇస్తే ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి బిడ్డగా మారారు. వరదల విపత్తు సమయంలో, కష్టకాలంలో కూడా దిగజారుడు రాతలు రాయించడం సిగ్గుచేటు. వరదల సమయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారు. మీరు చేసేది పాలిటిక్స్‌ కాదు … పాలిట్రిక్స్‌.

వరదలు వచ్చి, అయిపోయాక చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అంటూ హడావుడి చేస్తాడట. ఇదే ఈనాడులో వచ్చిన ఇటువంటి చెత్త వార్తలతో చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి పాలిట్రిక్స్‌ చేస్తాడు. ఇక పవన్‌ కల్యాణ్‌ మండపేట, భీమవరం వెళ్లారు. పక్కనే గోదావరి. అయినా గోదావరి గట్టుకు రాలేదు. బాధిత ప్రజల్ని పరామర్శించలేదు. చంద్రబాబు ప్రెస్‌మీట్‌ కాగానే పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌ ట్వీట్‌ చేస్తారు. చీప్‌ పాలిటిక్స్‌ చేస్తున్న మిమ్మల్ని ప్రజలు ద్వేషించే పరిస్థితికి తెచ్చుకున్నారు. రామోజీరావు, ఈ వయసులో అయినా ఈనాడు దినపత్రిక క్రెడిబులిటీ పెంచుకుంటారనుకుంటే మరింత దిగజారి, ప్రభుత్వంపై బుదర చల్లించే కార్యక్రమం చేస్తున్నారు.

రూ. 2 వేలు తక్షణ సాయంగా ఇస్తున్నాం
విపత్తు సమయంలో బాధితుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. పునరావాస కేంద్రాల్లో కూడా ఉన్నవారందరికీ నాణ్యతతో కూడిన భోజనాన్ని అందిస్తున్నాం. క్యాంప్‌ నుంచి బాధితులు తమ ఇళ్లకు వెళ్లేటప్పుడు ఒక్కో కుటుంబానికి రూ.2వేలు తక్షణ ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలా?

రామోజీరావు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. చంద్రబాబు లెగ్‌ మహత్యం ఏమోకానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు మండుటెండలు బాగా వస్తాయి. కరువు వస్తుంది, ఆ సమయంలో మనుషులు తినడానికి తిండి దొరకదు కదా, పశువులు తినేందుకు గడ్డి కూడా ఉండేదికాదు. విజయనగరం జిల్లాలో పొలాలు అమ్ముకుని భోజనం చేసినవాళ్లు కూడా ఉన్నారు. అలాంటి దారుణమైన పరిస్థితి చంద్రబాబు హయాంలో వచ్చినా.. రామోజీరావు తన పత్రికలో రాయలేదు. అవన్నీ ఆయన కంటికి కనిపించలేదు.

ఇవాళ పశువులకు కూడా మేలైన మేత అందించడం జరిగింది. నేను స్వయంగా పర్యటించాను, పలు ప్రాంతాల్లో పశుగ్రాసం అందించాం. ఏ ఒక్క జీవరాశికి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాం. ఇంత జరుగుతున్నా ప్రజలు అసహ్యించుకుంటారనే సిగ్గు లేకుండా నిసిగ్గుగా పనికిమాలిన రాతలు రాయడం బాధాకరం. జగన్‌ పాలన చాలా బాగుందుని ప్రజలకు తెలుసు. సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ అందిస్తున్నారని ప్రతి గ్రామంలోనూ తెలుసు. మా ముఖ్యమంత్రి అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారనే విషయం రాష్ట్రమంతా తెలుసు. అయినా సరే టీడీపీని, చంద్రబాబు నాయుడును రాతలతో, చేతలతో పైకిలేపాలని రామోజీరావు ఎంత ప్రయత్నించినా కిందకే కానీ పైకి లేవరు. మీతో పాటు, మీ పత్రిక కూడా దిగజారిపోతోంది.

రాష్ట్ర ప్రజల కోసం జగన్‌ మోహన్‌ రెడ్డి అహర్నిశలు పని చేస్తున్నారు. వరద బాధితుల్ని ఆదుకునేందుకు, సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు అంతా సమిష్టిగా పనిచేస్తోంది. ఈ విషయాన్ని విమర్శలు చేసేవారు గుర్తుపెట్టుకుంటే మంచిది.

Leave a Reply