Suryaa.co.in

Political News

మహా ‘నాయుడు’!

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి నేటి కి 28 ఏళ్ళు!
కఠోర యోగాభ్యాసం
ఏడుపదుల వయసులోనూ దూకుడు
రాజకీయాలు ఆయనకు వారసత్వంగా రాలేదు
స్వతంత్ర వ్యక్తిగా వచ్చి మహోన్నత శక్తిగా ఎదిగిన చరిత్ర ఆయనది
చంద్రబాబు విశేష కృషికి అద్భుత వరం హైటెక్ సిటీ
రైతులను ఆదుకునేందుకు రూ15,500 కోట్లు రుణ మాఫీ
నిత్య విద్యార్థి నారా
నిరంతర శ్రామికుడు
జనమే ఆయనకు ఆక్సిజన్
బాబుకు జనమే కిక్కు
నేతలను జనం మధ్యలో నిలిపిన నారా
అధికారం ఉన్నా లేకున్నా జనమే శ్వాస
అభివృద్ధికి చిరునామా చంద్రబాబు
నవతరం రాజకీయ నాయకులకు ఆయనొక పాఠ్యగ్రంధం

సరిగ్గా ఇదే రోజు1995 సెప్టెంబర్ 1 న మహానాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి నేటి కి 28 ఏళ్ళు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్ర అభివృద్ది కోసం,విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం ఆయన చేసిన కృషి,పడిన తపనను నెమరు వేసుకోవడంలో తప్పులేదని భావిస్తున్నాను. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం ద్వారా.. తన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని సార్ధకం చేసుకొనే సువర్ణావకాశం దక్కింది ఆ మహానాయకుడి కి .

రాజకీయ అవసరాల కన్నా ప్రజలే ముఖ్యమని, ప్రజలే ముందని చెప్పిన- నమ్మిన గొప్ప రాజనీతిజ్ఞుడు చంద్రబాబు. దేశ,రాష్ట్ర రాజకీయాలలో చంద్రబాబుది గొప్ప చరిత్ర. అబ్బురంగా చెప్పడం కాదు రాజకీయంగా ఎవరు అంగీకరించినా,అంగీకరించకపోయినా , 1995 సెప్టెంబర్ 1 న ముఖ్యమంత్రిగా చంద్రబాబు భాధ్యతలు చేపట్టిన నాటి నుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన అధ్యాయం ఆరంభమైంది. ఆంధ్రప్రదేశ్ ని పాలించిన ముఖ్యమంత్రులలో చంద్రబాబుకి ప్రత్యేకమైన స్థానం ఉంది.

సరిలేరు ఆయనకెవ్వరు. ఆంధ్రప్రదేశ్ ని భారత దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్న ప్రగాడ లక్ష్యాన్ని నిర్దేశించుకొని కాలంతో పోటీపడ్డారు .ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పెరిగి తాను చరిత్రలో తన కంటూ ఓ స్థానాన్ని పదిలపరుచుకోవాలన్నపట్టుదలతో ఆయన చేసిన కృషి, అందరికీ సాధ్యమయ్యే పనికాదు. రాజకీయాలు ఆయనకు వారసత్వంగా రాలేదు. స్వతంత్ర వ్యక్తిగా వచ్చి మహోన్నత శక్తిగా ఎదిగిన చరిత్ర ఆయనది.

పరిమిత కాలంలో అపరమిత కృషితో ఒక సామాన్యుడు , జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగవచ్చని నిరూపించిన చరిత్ర చంద్రబాబుది. నాలుగున్నర దశాబ్దాలుగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్ళు, మరెన్నో సంక్షోభాలను ఎదుర్కొని వాటినే అవకాశాలుగా మలుచుకొని దార్శనికత నేతగా ఎదిగిన మూర్తి,స్పూర్తి చంద్రబాబు. రాష్ట్ర అభివృద్ది, ప్రజాసంక్షేమమే పరమావధిగా, స్థితప్రజ్ఞతో ఒక ప్రత్యేక జీవన సరళిని అనుసరిస్తున్న వ్యక్తి,ఆయనకు సృశించని అంశాలు కానీ,అవగాహన చేసుకోలేని సబ్జెక్టులు కానీ ఉండవు.

దేశంలో అందరికంటే అనుభజ్ఞుడైన ప్రజానాయకుడు ఆయన. తెలుగు ప్రజలు అందరికంటే ఎక్కువగా ఆదరించి అక్కున చేర్చుకున్న నాయకుడుగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు.ఏడు పదులు దాటిన వయస్సు అందులో 45 ఏళ్ళు ప్రజాజీవితమే. రెండు దఫాలు మంత్రిగా, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా,మరో పదేళ్ళు ప్రతిపక్షనేతగా,విభజన అనంతరం ఏర్పడ్డ నవ్యాంధ్రకు అయిదేళ్ళు ముఖ్యమంత్రిగా,ఇప్పుడు నవ్యాంధ్రలో నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు.

ఇంత సుదీర్ఘ కాలం ప్రజా నాయకుడుగా 1956 నుండి ఇప్పటివరకు సుదీర్ఘ అనుభవంతో ఆయనతో పోల్చగల దగ్గ నాయకుడు లేడు. కఠోర శ్రమ,క్రమశిక్షణ,విలువలతో కూడిన నియమబద్దమైన జీవన శైలి ఆయనది.భావితరాల శ్రేయస్సు కోసం,నిరంతర ఆలోచనలతో,విన్నూత్న ప్రణాళికలు రూపొందించడంలో ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకొన్న కార్యదక్షుడు.

తన దార్శనికతతో తెలుగుజాతి భవితను తీర్చి దిద్దడమే కాకుండా, సరికొత్త విధానాలతో నవ్య చరిత్రకు నాంది పలికి, దేశ రాజకీయాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు.విద్యార్ధి నాయకుడి నుంచి రాష్ట్రపరిపాలనా సారధి వరకు ,దేశ-రాష్ట్ర రాజకీయాలలో ఎదగాలనుకొనే వారికి చంద్రబాబు ఒక పుస్తకం అని చెప్పాలి.

ప్రపంచ రాజకీయ యువనికపై సుస్పష్టమైన,ప్రణాళిక,దార్శనికత కలిగిన అతికొద్ది మంది నాయకుల్లో చంద్రబాబు ఒకరు. ఆర్ధిక అసమానతలు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని ఆశించి అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టారు.తమ సమస్యలు తామే పరిష్కరించుకోవాలనే సమిష్టి భావనను అలవర్చడానికి 1997 జనవరి 1 న జన్మభూమి కార్యక్రమాన్నిరూపొందించారు.

అందరు భయపడే రోజుల్లోనే ఆర్ధిక సంస్కరణలు అమలు చేసి సంపద సృష్టికి బీజం వేశారు. వాటి ఫలితాలు సమాజంలోని పేదలకు అందించాలని ఆరాట పడిన నాయకుడు.అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆంద్రప్రదేశ్ ను ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దెందుకు, 1998 లో స్పష్టమైన విజన్ 2020 డాక్యుమెంటు ను రూపొందించి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. విజన్ 2020 డాక్యుమెంట్ కు అనుగుణంగా ప్రభుత్వ పాలసీలు,కార్యక్రమాలు రూపొందించి.. సాంకేతిక పరిజ్ఞానంతో 1995- 2004 మధ్య అభివృద్ధిని పరుగులు తీయించారు.

మధ్యప్రదేశ్,కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు పరిపాలనతో పోటీ పడటానికి ప్రయత్నించారు. రహదారులు,విద్యుత్తు సంస్కరణల అమలు, ఓపెన్ స్కై పాలసీ,టెలికాం సంస్కరణలు వంటివి అమలు చేసి దేశ ఆర్ధిక ముఖచిత్రాన్ని మార్చడంలో ప్రధాన పాత్ర పోషించారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి ఏమి తెలియని రోజుల్లో, హైదారాబాద్ లో ఐటి రంగాన్ని అభివృద్ది చెయ్యడం చంద్రబాబుకే సాధ్యమైంది.

అందరికంటే ముందు సాంకేతికాభివృద్ధి గుర్తించి ఆ దిశగా యువతను నడిపించారు. నాలెడ్జ్ ఎకానమీ సృష్టించాలని ముఖ్యమంత్రిగా అమెరికా వీదుల్లో 14 రోజులు ఫైళ్లు చేతపట్టుకొని తిరిగి, 1998 లో హైటెక్ సిటీ నిర్మించిన సౌధం ఫలితంగా.. హైదరాబాద్ సాప్ట్ వేర్ రంగానికే తలమానికంగా నిలిచింది. హైటెక్ సిటీ నిర్మాణంతో సైబరాబాద్ అనే ఒక శివారు నగరమే నిర్మితమైంది అంటే చంద్రబాబు పాలనా ఫలితమే అని చెప్పాలి.

ఆ మధ్య మాజీ ప్రణాళికా సంఘం అధ్యక్షులు మాంటే సింగ్ అహ్లువాలియా మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారంతా చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పాలని అహ్లు వాలియా అనడం అంటే, ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలినీయంగా ప్రసిద్ధి పొందిన చంద్రబాబు ఖ్యాతి ఎలాంటిదో అర్ధం అవుతుంది.చంద్రబాబు విశేష కృషికి అద్భుత వరం హైటెక్ సిటీ.

భారీ వేతనాలతో కూడిన లక్షలాది ఉద్యోగాలు, ఏటా వేల కోట్ల రూపాయల ఐ టి ఎగుమతులు ఈనాడు సాధ్యమవుతున్నాయి అంటే ఆనాడు చంద్రబాబు కృషే కారణమని చెప్పాలి. బెంగళూరు,ముంబై తో పోటీ పడి ఐటి రంగాన్ని హైదరాబాద్ ఆకర్షించడానికి చంద్రబాబు చొరవే కారణం. ఆయన ఉమ్మడి రాష్ట్రాభివృద్దికి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు యావత్ భారతదేశాన్నే కాక ప్రపంచ ఆర్ధిక నిపుణులను ఆకర్షించాయి.

జంట నగరాలకు తోడు సైబరాబాద్ ను సృష్టించి ఆంధ్రుల రాజధానికి ప్రపంచపటంలో గుర్తింపు తెచ్చారు. విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు వల్ల ఎంతో మంది యువతీ,యువకులు విదేశాల్లో స్థిరపడి ఉన్నత స్థానాల్లో నిలబడేలా చేసింది.నేడు తెలుగువారు ప్రపంచం నలుమూలలా వృత్తి,ఉద్యోగాల్లో రాణించి ఎంటర్ ప్రెనూర్లుగా ఎదిగారంటే, అది చంద్రబాబు దార్శనికత వల్లనే.

మహిళలను ప్రబల శక్తిగా మలచడంలో చంద్రబాబు, దేశంలో ఒక నిశ్శబ్ద విప్లవం సృష్టించారు. మహిళా సాధికారత సాధించాలని స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో బిజినెస్ స్కూలు , ఇండియన్ ఇని స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటు,రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో సిమెంటు రోడ్లకు రూపకల్పన,జన్మభూమి, ప్రజల వద్దకు పాలన,వంటి కార్యక్రమాలతో రాష్ట్ర అభివృద్దిని పరుగులు పెట్టించారు.ప్రాధమిక విద్య మొదలుకొని, ఉన్నత విద్యవరకు ఎనలేని ప్రోత్సాహం అందించారు.

ఎస్సీ,ఎస్టీ సంక్షేమానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేశారు.బీసీలకు 33 శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేశారు.నీరు-మీరు కార్యక్రమం ద్వారా జలసంవరక్షణ, భూసార రక్షణ, చెరువుల పూడిక తీత వంటి విన్నూత్న కార్యక్రమాలతో వ్యవసాయ రంగం అభివృద్దికి కృషి చేశారు. రైతు బజార్లు ఏర్పాటు చెయ్యడం రాష్ట్ర చరిత్రలో నూతన ఆద్యాయం. తుఫానులు వచ్చినా,వరదలు వచ్చినా,కరువు లొ చ్చినా ఆగమేఘాలపై స్పందించే తత్వం ఆయనది.

ప్రకృతి వైపరీత్యాలు విరుచుకు పడి నప్పుడు తక్షణం స్పందించి, తెలుగు ప్రజలకు అండగా నిలిచి ఆదుకోవడం లోనూ చంద్రబాబు ముందుంటారు. చంద్రబాబు ఆశయాలు విధానాలు ప్రజల ప్రగతి కోసం ఏర్పరుచు కున్నవే. అందుకు స్పష్టమైన ఆచరణాత్మకమైన ప్రణాళిక ఆయనది. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే నాయకులున్న ఈ రోజుల్లో.. నిత్యం ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రజల వద్దకు పాలన తెచ్చింది చంద్రబాబే.

అప్పటి అమెరికా అద్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటీష్ ప్రధాని టోనీ బ్లెయిర్ వంటివారు ఆంధ్రప్రదేశ్ ను సందర్శించి, చంద్రబాబు పరిపాలనను ప్రశంసించారు,చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో భారతదేశ రాజకీయ నాయకులు ఎవరికి దక్కని గుర్తింపును , అంతర్జాతీయ ప్రశంసలు పొందారు. 1978 నుండి నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో అత్యంత క్రియాశీలంగా వ్యవహరించడం ఎలా సాధ్యమైంది అంటు, చంద్రబాబు వద్ద బ్రిటన్ ప్రధాని టోని బ్లేయర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఒకసారి.

ఒకసారి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్యామిలీ ఆగ్రా వెళ్లారు. అక్కడ తాజ్ మహల్ వద్ద ఒంటె బండి ఎక్కగా.. ఆ బండిని నడుపుతున్న కుర్రవాడు ఆఫ్ కహా సే ఆయే అని అడగగా విజయవాడ అంటూ ఆ దంపతులు చెప్పగా, అవునా చంద్రబాబు నాయుడు అచ్చా నాయకుడు అని ఆ కుర్రాడు ఉత్సాహంగా వారి వైపు ఆనందంతో చూసాడు.

ఆశ్చర్యం ఏమిటంటే అప్పుడు చంద్రబాబు సియంగా కూడా లేరు. ఉత్తరాదిలో ఓ చిన్న పిల్లవాడికి సైతం ఆంధ్రప్రదేశ్ అనగానే.. చంద్రబాబు గుర్తుకు రావడం అంటే రాష్ట్ర అభివృద్ధి పై ఆయన వేసిన అభివృద్ధి ముద్ర అని చెప్పాలి. ఇంటా,బయట చంద్రబాబు నాయుడు అంటే అందరికీ పరిచయం వున్న పేరు. ఇతర రాష్ట్రాల్లో రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు తెలుగువాళ్ళం అని తెలియగానే, అక్కడి వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న బాబు కైసా హై? అంటూ ఆయనను తమలో కలుపుకొనే వారు.

ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడికి పరాయి రాష్ట్రాల్లో అటువంటి ప్రజాదరణ లభించడం అపూర్వం. విదేశాల్లో అయితే ఇక చెప్పనక్కరలేదు.ప్రవాసాoధ్రులకు మన దగ్గర ఓటు కల్పిస్తే రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం విన్నాం. ప్రపంచ ప్రసిద్ధి పొందిన షికాగో స్టేట్ యూనివర్సిటీ చం, ఒక విదేశీ రాజకీయ నాయుడుకి ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించడం ప్రధమం.

దార్సనికత, అసాధారణ ప్రతిభా సామర్ధ్యాలు,సంస్కరణా దృక్పధం వున్న చంద్రబాబుకు డాక్టరేట్ ప్రకటిస్తున్నట్లు, షికాగో విశ్వవిద్యాలయం పేర్కొన్నది. షికాగో విశ్వవిద్యాలయం చరిత్ర చూసి గౌరవ డాక్టరేట్ తీసుకోవడానికి చంద్రబాబు అంగీకరించారు.పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలన్నదే ఆయన ఆశయం. సమాజంలో ఆర్ధిక అసమానతలు తొలగించాలని,భారతదేశాన్ని అన్ని రంగాల్లో విశ్వగురువుగా ఆవిష్కరించే లక్ష్యంతో, పంచ వ్యూహాలతో విజన్ 2047 డాక్యుమెంట్ ను రూపొందించారు ఈ మధ్య చంద్రబాబు.

ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మ గౌరవ చిహ్నంగా నిలిస్తే ,చంద్రబాబు తెలుగువారి ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా నిలిచారు.అధికారంలో ఉన్నా,లేకున్నా, ఏదైనా అధికారిక పనుల్లో విదేశాలకు వెళ్ళినా,ఎప్పుడైనా కుటుంబంతో విదేశాలకు వెళ్ళినా,ఆఖరికి విమాన ప్రయాణంలో ఉన్నప్పుడు, ప్రజలకు సంబంధించిన అంశాల పైనే దృష్టి పెడతారు. ప్రతి పనిని పవిత్ర యజ్ఞంగా భావిస్తారు.లక్ష్యం నిర్ణయించుకొని దాన్ని చేరుకొనేందుకు నిరంతర శ్రమ,వ్యూహం ఉండాలి అంటారు. అందుకే నవతరం రాజకీయ నాయకులకు ఆయనొక పాఠ్యగ్రంధం అని చెప్పాలి.

జాతీయ రాజకీయాలను కూడా చంద్రబాబు ప్రభావితం చేశారు.నేషనల్ ప్రoట్ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ కేంద్ర పెత్తనానికి ఎలా కళ్ళెం వేశారో యునైటెడ్ ప్రంట్ ఏర్పాటు, ఆ తర్వాత ఎన్డీఏ ఏర్పాటుకు అంకురార్పణ చేసినవారిలో చంద్రబాబుదే కీలక పాత్ర. ఒకానొక దశలో ఆయన్ని ప్రధాని కావాలని పార్టీలు అన్నీ కోరినా , తాను రాష్ట్రానికే అంకితం అని స్పష్టం చేసిన నాయకుడు.

దేశ ప్రధానుల నియామకంలో రెండుసార్లు ముఖ్య పాత్ర వహించారు. రాష్ట్ర పతులుగా కెఆర్ నారాయణయన్ , అబ్దుల్ కలాం ఎంపికలోనూ కీలక పాత్ర పోషించారు. చంద్రబాబుకు నిజమైన అభిమానులు అనేక మంది వున్నారు. ప్రతిఫలం గురించి ఆలోచించ కుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, లేక పార్టీ ప్రయోజనాలు కోసం ఆయన్ని అభిమానించేవారు కోకొల్లలు. ఆయన పాలనలో రాష్ట్ర ప్రయోజనాలు పదిలంగా ఉంటాయని అందరి నమ్మకం.అంతేకాదు ప్రతి కార్యకర్తని పేరుతొ పలకరించి వాళ్ళ మంచి,చెడు తెలుసుకుంటారు ఆయన.

రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంద్రను అభివృద్ది చేయడానికి చంద్రబాబు, తనను తాను రాష్ట్రానికి సమర్పించుకున్నారు. అమరావతిని అద్భుతంగా నిర్మించి రాష్ట్ర ఆదాయం పెంచాలని, యువతకు ఉపాధి కల్పించాలని చంద్రబాబు తపన పడ్డారు. అమరావతి నిర్మాణం పూర్తయితే ఐదు కోట్ల ప్రజల ప్రస్థానం మరో మలుపు తిరిగి, ఐదు కోట్ల ప్రజల తలరాతలు అపూర్వం అయ్యేవి.

చంద్రబాబు పిలుపుకు స్పందించి 29 గ్రామాల నుండి 28 వేల మంది రైతులు .. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు భూములు ఇవ్వడం గర్వకారణం. ఇది ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో నవ్యాంధ్ర అద్భుత ప్రగతి సాధించింది.17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆంద్రప్రదేశ్ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. అతి వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను దేశం ముందు నిలిపారు చంద్రబాబు .

ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతున్నా, సంక్షేమ పథకాలు అమలులో దేశంలో ఆంధ్రప్రదేశ్ ని ఆదర్శంగా నిలిపారు. నిరుపేదలు, రైతులు, మహిళలు, కార్మికులు, దళితులు ఇలా అన్ని వర్గాల జీవనాన్ని గుణాత్మకంగా మార్చేందుకు బృహత్తర లక్ష్య సాధన కోసం విలక్షణమైన ఎన్నో సామాజిక పథకాలకు శ్రీకారం చుట్టి బడుగుల బతుకుల్లో భాగ్యోదయం కల్పించేందుకు 100కి పైగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచారు చంద్రబాబు.

ఆర్థిక ఇబ్బందులలో ఉన్న రైతులను ఆదుకునేందుకు రూ15,500 కోట్లు రుణ మాఫీ చేశారు. రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చాలన్న ధృఢ సంకల్పంతో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నాలుగున్నరేళ్లలో ఎన్నడూ లేని విధంగా రూ.67 వేల కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరు అందించాలన్న దృఢ సంకల్పంతోదశాబ్ధాలుగా కాగితాలకే పరిమితమైన ఆంధ్రప్రదేశ్ ను సస్య శ్యామలం చేసే భారీ ప్రాజెక్టు పోలవరంను 70శాతం పూర్తి చేశారు.

పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా,గోదావరి నదులు అనుసంధానం అనే ఆదర్శాన్ని నిజం చేసి చూపిన ఒక వజ్ర సంకల్పుడు చంద్రబాబు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించి, పరిశ్రమలు ఆకర్షించి,ఉపాధి కల్పించారు. పారిశ్రామిక ప్రగతి పరుగుల వెనుక చంద్రబాబు కఠోర శ్రమ ఉంది. ఆయన హయాంలో వేల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయంటే, చంద్రబాబు పాలనా దక్షతే దానికి కారణ.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి .. దేశంలోనే వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ను మొదటిస్థానంలో నిలిపారు. ఆర్ధిక ఇబ్బందుల్లోనూ దేశంలో మరే రాష్ట్రం సాధించనంత వృద్దిరేటును ఆంధ్రప్రదేశ్ సాధించడం గర్వకారణం. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, వినూత్న విధానాలతో ఆదాయ వనరులు పెంచారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపారు. సమ్మిళిత,సుస్థిరత అభివృద్దే లక్ష్యoగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ వృద్దిరేటు 11.2శాతం సాధించారు.

చంద్రబాబు దీర్ఘకాలం అదికారంలో కొనసాగి వుంటే హైదారాబాద్ వంటి నగరాన్ని నవ్యాంద్రలోను నిర్మించేవారు.విశాఖ పట్నాన్ని ఒక సిలికాన్ వ్యాలీగా,అమరావతిని సకల విద్యలకు కాణాచిగా, తిరుపతి శ్రీ సిటీని ఒక పారిశ్రామిక హబ్ గా మార్చే వారు. అందుకే జాతికోసం, జగతి కోసం,ప్రగతి కోసం మళ్ళీ చంద్రబాబు రావాలని ప్రజల ఆకాంక్ష.చీకట్లు కమ్మిన ఆంధ్రప్రదేశ్ లో వెలుగులు విరజిమ్మాలి అంటే మళ్లీ చంద్రబాబు పాలన రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

( నేటికి సరిగ్గా మహానాయకుడు చంద్రబాబు, ముఖ్యమంత్రిగా భాధ్యతలు చేపట్టి 28 ఏళ్ళు అయిన సందర్భంగా ప్రత్యేక వ్యాసం )

నీరుకొండ ప్రసాద్,
సీనియర్ జర్నలిస్ట్,
9849625610

LEAVE A RESPONSE