★బొప్పూడి వద్ద స్వాగతం పలికిన పసుపు సైనికులు
★గజమాలతో సత్కరించిన ఎమ్మెల్యే ఏలూరి
★ఎమ్మెల్యే ఏలూరి ఆధ్వర్యంలో 5000 బైక్ లతో 16 కిలోమీటర్ల భారీ ర్యాలీ
★చంద్రన్నకు సారధిగా సాంబన్న
★పసుపు మాయం అయిన రహదారులు
★కదలి వచ్చిన మహిళలు యువత
★అడుగడుగునా బ్రహ్మరథం
★హైవే వెంట నీరాజనం పలికిన మహిళలు
★అధినేత ఒంగోలు గిత్తలు సవారీ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రన్న ఒంగోలు పర్యటన నేపథ్యంలో పర్చూరు నియోజకవర్గం సరిహద్దుల్లో ఎమ్మెల్యే ఏలూరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. స్వర్గీయ నందమూరి
తారకరామారావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఒంగోలు నిర్వహిస్తున్న మహానాడు అధినేత గురువారం పయనమయ్యారు. తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయం నుంచి ఐదువేల బైకులతో బొప్పూడి ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద అధినేత చంద్రన్న కు బ్రహ్మరథం పట్టారు.
భారీ గజములను అధినేత చంద్రన్నకు వేసి జై చంద్రబాబు జై జై చంద్రబాబు సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహానాడు సందర్భంగా అధినేత రాకతో పార్టీ శ్రేణులు తోరణాలు జెండాలతో 16 కిలోమీటర్ల మేర పసుపుమయం చేశారు. బొప్పూడి నుండి బొల్లాపల్లి టోల్ ప్లాజా
వరకు భారీ వాహనశ్రేణి తో రోడ్లన్నీ కిక్కిరిశాయి అడుగడుగునా మహిళలు యువత చంద్రన్నకు జనం నీరాజనం పలికారు కాబోయే సీఎం చంద్రన్న అంటూ మా భవిష్యత్తు మీ చేతుల్లోనే మళ్లీ మీరే రావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పూల వర్షం కురిపించారు. చంద్రన్న రాకతో రహదారులన్నీ పులకించి పోయాయి. యువత మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడంతో హైవే ఇరువైపుల జనసంద్రంగా మారింది. ఇసుక దర్శి ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయం వద్ద ఒంగోలు గిత్తల ఎడ్లబండిపై అధినేత చంద్రన్న, ఎమ్మెల్యే సాంబన్నలు సవారీ చేశారు.
రహదారులు పసుపుమయం..
అధినేత చంద్రన్న రాకతో రహదారులకు ఇరువైపులా పసుపు తోరణాలు జెండాలతో హైవే పసుపు మయంగా మారింది. రహదారులన్నీ ఎమ్మెల్యే ఏలూరి ఆరడుగుల జెండాలు ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అధినేతకు రథసారధిగా…
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి బొప్పూడి వద్ద గజమాలతో స్వాగతం పలికిన శ్రేణులు 16 కిలోమీటర్ల మేర అధినేత వెంటే పయనించారు. బొప్పూడి వద్ద అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే ఏలూరి వాహనంలో ఎక్కారు. అధినేతకు రథసారధిగా ఎమ్మెల్యే ఏలూరి 16 కిలోమీటర్ల మేర డ్రైవింగ్ చేశారు దీంతో పార్టీ శ్రేణులు కేరింతలు కొడుతూ ఎమ్మెల్యే ఏలూరి వాహనం వెంట వచ్చారు.
ప్రత్యేక ఆకర్షణగా….
ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయం వద్ద పోపూరి శ్రీనివాసరావు చెందిన ఒంగోలు గిత్తల ఎడ్లబండిపై అధినేత చంద్రన్న సవారీ చేశారు కొంత దూరం ఎడ్లబండిని నడిపిన ఆయన ఉత్సాహంగా ర్యాలీలో
పాల్గొన్నారు. ఒంగోలు గిత్తలు పౌరుషానికి ప్రతీకగా నిలవడం ప్రకాశం జిల్లాకు తలమానికంగా నిలుస్తున్న ఒంగోలు గిత్తలపై అధినేత సవారీ చేయడం రైతుల్లో ఆనందం నెలకొంది.
అధినేతకు సమస్యల వినతి…
అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయం వద్ద పలువురు సమస్యలపై అధినేత చంద్రబాబుకు విన్నవించారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.నారా చంద్రబాబు నాయుడు గారికి ఘనస్వాగతం పలికేందుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అద్దంకి నుండి భారీ బైక్ ర్యాలీతో తరలిన తెదేపా నేతలు,గొట్టిపాటి అభిమానులు.
నారా చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికేందుకు బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న గౌరవ శాసనసభ్యులు గొట్టిపాటిరవికుమార్,గిద్దలూరు మాజీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి,కందుకూరు మాజీ శాసన సభ్యులు పోతుల రామారావు,దివి శివరాం,దామచర్ల జనార్దన్,కొండెపి ఎమ్.ఎల్.ఏ డోల బాల వీరంజనేయ స్వామి,డా.నుకసాని బాలాజీ,మార్కాపురం మాజీ శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి, దర్శి టీడీపీ ఇంచార్జ్ పమిడి రమేష్,కనిగిరి మాజీ శాసన సభ్యులు డా.ఉగ్ర నరసింహ రెడ్డి,వై.పాలెం టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఏరిక్షన్ బాబు,తెలుగు మహిళలు,టీడీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు,టీడీపీ నాయకులు, తెలుగు యువత చంద్రబాబు నాయుడు కు స్వాగతం పలికారు.