Home » డిడ్ ఏ మిస్టేక్!

డిడ్ ఏ మిస్టేక్!

తప్పు చేశావయ్యా !
ఆపాలనుకున్నావు!
అలంకరణలు తొలగించావు!
సిగ్గుగా లేదు..
ఇంత చిల్లరగా ప్రవర్తించటానికి !?
ఒక రాజకీయపార్టీ..ప్రతి సంవత్సరం ..వ్యవస్ధాపక అధ్యక్షుడి జన్మదినం కలిసొచ్చే రోజున..మహానాడు జరుపుకుంటారు!
అదొక వేడుక..చర్చా వేదిక!
కార్యకర్తలే పునాది !

నాలుగుదశాబ్దాల చరిత్ర!
తెలుగు వారి భావోద్వేగ బంధం!
ఆత్మగౌరవ నినాదం!
వారిని అడ్డుకోగలననుకున్నావా!?
ఆపే శక్తి ఉందనుకున్నావా!?
వంకర బుద్ది..బయటపడటం కాకపోతే సాధించింది ఏమిటి!?
మీ వికారపు..పైత్యకారి పనుల వల్ల..రెట్టించిన ఉత్సాహం తో పాల్గొంటున్నారు.
ఈ మూడేళ్ళ నిర్వాకం చూసిన తర్వాత..!

ఆటంకాలు కల్పించటానికి మీరు వేసే పిల్లి మొగ్గలు చూసిన తర్వాత..!
జన సునామి..వస్తుంది..!
నిజానికి రేపు ఎల్లుండి..మహానాడు!
కానీ..చూడు ఇవాళే జనజాతర జరుగుతుంది.
రేపు ..ఆ మరునాడు మీ బుర్రపాడయిపోద్ది!

తప్పు చేశా వయ్యా..
లెక్క పక్కాగా వ్రాస్తున్నారు..!
పసుపు కోట పటిష్ఠం కాబట్టి తట్టుకున్నారు..!
అక్రమాలు..అవనీతి..దోపిడీ..నేర చరిత్ర పునాదుల మీద నిలిచారు మీరు..తట్టుకోలేరు!

– అడుసుమిల్లి శ్రీనివాసరావు

Leave a Reply