– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా మహానాడును విజయవంతం చేయగలిగాం. మహానాడుకు ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చిన స్పందన చూసి వళ్లు పులకరించింది. ప్రభుత్వం ఎంత బెదిరించినా, అధికార పార్టీ నేతలు ఎన్ని హెచ్చరికలు చేసినా లెక్క చేయకుండా విలువైన భూమిని మహానాడు నిర్వహించుకోవడానికి ఇచ్చిన మండువవారిపాలెం రైతులందరికి టీడీపీ తరపున పాదాభివందనాలు. మహానాడు జరగకుండా జగన్, ఆయన తాబేదారులు అనేక అడ్డంకులు సృష్టించారు.
అయినా లక్షలాది మంది, ఇసుక వేస్తే రాలనంత జనం హాజరయ్యారు. 46 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నా లక్క చేయకుండా జనం తండోపతండాలుగా వచ్చారు. 10 నిమిషాలు ఎండలో నిల్చోవాలంటే ఎంతో కష్టమో తెలిసి కూడా జనం మహానాడు ప్రాంగణానికి వచ్చారు. ఇంత ఎండ ఉన్నప్పటికి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 12 గంటలపాటు వేచి ఉండి సమావేశాన్ని విజయవంతం చేయడం గొప్ప విషయం.
ఇది వైసీపీపై వచ్చిన తిరుగుబాటు అని స్పష్టంగా అర్థమవుతోంది. వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టింది. తొలుత మహానాడుకు నిర్ణయించిన స్టేడియం స్థలం ఇవ్వలేదు. ఆర్టీసీ బస్సులకు డబ్బులు కట్టించుకొని బస్సులు ఇవ్వడానికి నిరాకరించారు. ప్రైవేటు బస్సు యజమానులకు ఆర్టీవోలు, బ్రేక్ ఇన్స్ పెక్టర్లు ఫోన్లల్లో హెచ్చరికలు చేశారు. అద్దె కార్ల యజమానులకు కూడా హెచ్చరికలు చేస్తూ భయపెట్టారు. ఎవరు ఎన్ని హెచ్చరికలు చేసినా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు జనం తరలివచ్చారు. గత ఇరవై సంవత్సరాల నుండి లారీలపై, ట్రాక్టర్లపై జనం రావడం చూడలేదు. ఎన్టీరామారావు పార్టీ పెట్టినప్పుడు లారీలు, ట్రాక్టర్లు, యడ్లబండ్లపై, కాలినడకతో జనం వచ్చిన సందర్భాలున్నాయి.
మహానాడు విజయవంతానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. జిల్లా వాసులకు సెల్యూట్. ఒంగోలు, ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, పరిసర ప్రాంత ప్రజానీకానికి హృదయపూర్వక అభినందనలు. నాయకులు, కార్యకర్తలు సొంతంగా డబ్బు ఖర్చు పెట్టుకుని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఇతర జిల్లావాసులు ప్రకాశం జిల్లావాసులను ఆదర్శంగా తీసుకోవాలి. సంఘటితంగా ఒక మాట మీద నిలబడి, ఒక ఛాలెంజ్ గా తీసుకొని అందరూ పనిచేశారు. 12 వేల మందికి టీడీపీ తరపున ఆహ్వానాలు పంపాము. దీనికి రెండింతలు, మూడింతలు ఆహ్వానితులు వస్తారని అనుకున్నాం. సముద్రం పొంగినట్లుగా జనం వచ్చారు.
మొదటిరోజే లక్షలాదిమంది రావడంతో వారికి మంచినీళ్ల సరఫరా, భోజనం అందించడంలో కాస్త ఇబ్బంది కలిగింది. అన్యదా భావించొద్దు. ఎలక్ర్టానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ చాలా బాగా సహకరించారు. వారి సహకారం జీవితంలో మరవలేనిది. వైసీపీ నాయకులు అవాకులు, చవాకులు పేలుస్తున్నారు. వారి మాటలకు మేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చిన ప్రజల్లో, వారి ముఖాల్లో ప్రభుత్వంపై ఉన్న తిరుగుబాటు కనిపిస్తోంది. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి ఎప్పుడవుతాడు?
మా జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి అని యువకులు, మహిళల్లోని ఉత్సాహం చూస్తే కనిపిస్తోంది. మహానాడు విజయవంతానికి సొంతంగా సహకరిస్తూ.. సేవలు అందించినవారికి ఎంత సేవ చేసినా వారి రుణం తీర్చుకోలేము. టీడీపీ వల్గర్ గా మాట్లాడే పార్టీ కాదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ టీడీపీ పార్టీ. లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయల్సిన పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేశారు. సభా ప్రాంగణం నుంచి బస చేసిన చోటికి చేరుకోవడానికి నాకు మూడున్నర గంటలు పట్టింది. ట్రాఫిక్ ను కంట్రోల్ చేయాల్సిన పోలీసులు చోద్యం చూస్తుండిపోయారు. వైసీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలు మాని మంచిగా మెలగాలి. వైసీపీరాచరిక పార్టీలా వ్యవహరిస్తోంది. జగన్, ఆయన తాబేదారులు ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోవాలి.
ఇప్పటికైనా జగన్ లో మార్పు రావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విలేఖరుల సమావేశంలో సూచించారు. ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు శ్రీ పరుచూరి అశోక్ బాబు, బీద రవిచంద్ర యాదవ్, ప్రకాశం జిల్లా నేతలు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, డోల బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, దామచర్ల జనార్ధన్, దమచర్ల సత్య,ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు బాలాజీ, నియోజకవర్గ ఇన్చార్జిలు అశోక్ రెడ్డి,ఉగ్ర నరసింహారెడ్డి, విజయ్ కుమార్, పమిడీ రమేష్, ఎరైక్సన్బాబు, ఇంటూరి నాగేశ్వరరావు, రాష్ట్ర sc cell అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు, గుడపాటి శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యం, కంచర్ల శ్రీకాంత్, బాబి, జేడీ రాజశేఖర్,మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర బాబు తదతరులు పాల్గొన్నారు.