కల్ ఆజ్ ఔర్ కల్..
మూడు తరాల సినిమా..
అది కపూర్ ఖాందాన్ మహిమా..!
అతి పెద్ద మెలో డ్రామా..
పృథ్వీరాజ్ తో కలిసి
రాజ్ కపూర్..రణధీర్ హంగామా..!!
భారతీయ సినిమాకి ఆద్యుడతడు..
తొలి టాకీ ఆలం ఆరా
కపూర్ కుటుంబ చరిత్రకు
అదే సిరా..
ప్రపంచానికి అప్పుడప్పుడే
సినిమా పరిచయమవుతున్న వేళ..వెండితెరకు కపూర్ కళ!
చలన చిత్రం..
సామాన్య జనానికి
అదో విచిత్రం…
పృధ్విరాజ్ రాకతో
ఆ సినిమాకే చైత్రం..
తొలినాటి బాలీవుడ్ కి
అతగాడే అతి పెద్ద ఛత్రం!
ఎక్కడెక్కడో తిరిగిన
కపూర్ ఫ్యామిలీ..
పృథ్వీరాజ్ నటుడై
చేరి బొంబాయి..
సినిమా ప్రాణమై..
వెండితెరే ధ్యానమై..
కొడుకులుగా విస్తరించి
ఒక్కొక్కరు నటులై..
కుటుంబమే సినిమాగా..
సినిమానే కుటుంబమై..
నటనంత కుటుంబం
వెండితెరంత
వినోదాల కదంబం..!
పృథ్వీరాజ్..
వెండితెర వండర్
బాలీవుడ్ అలెగ్జాండర్…
మొఘల్ ఎ అజాంలో
అక్బరై..
పాదుషాను కళ్ల ముందు
ఆవిష్కరించిన
బాలీవుడ్ సెహెన్షా..!
నడుస్తోంది కపూర్ ఖాందాన్
నాలుగో తరం హవా..
అందరికందరూ వారేవా..
అంతటి ఘన చరితకు
పృథ్వీరాజ్ మూలం..
ఆ స్ఫూర్తితోనే వచ్చింది
తెలుగులో అక్కినేని వారి మనం..
వారసత్వ నటుల్లో దేశంలోనే
కపూర్ కుటుంబం ఘనం..!
దాదాసాహెబ్ ఫాల్కే పృథ్వీరాజ్ కపూర్ వర్ధంతి
-ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286