ముంబయిలో టెస్లా మోడల్ వై మొదటి కారును డెలివరీ చేశారు. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో టెస్లా తన మొదటి ‘టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్’ను జూలై 15, 2025న ప్రారంభించింది. ఈ షోరూమ్ తెరుచుకున్న నెల రోజుల్లోనే మొదటి టెస్లా మోడల్ వై కారు డెలివరీ అయింది. ఈ కారు తొలి యజమాని మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్ణాయక్. ఆయన బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని టెస్లా సెంటర్ వద్ద ఈ తెల్ల టెస్లా మోడల్ వై కారును స్వీకరించారు.