-వైద్యం కోసం విదేశాల నుంచి తరలి రావాలి
-వైద్యం వైద్యం అందక ఒక్కరు కూడా చనిపోయే పరిస్థితి రావద్దు
-మన పేదరికం చూపి అప్పులు తీసుకువచ్చి కోస్తాంధ్రకు తరలించారు
-అప్పుడు పేదరికానికి కేరాఫ్ మన జిల్లా… ఇప్పుడు అభివృద్ధికి ఖిల్లా
-ఒకప్పుడు వలసల జిల్లా ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలసలు
-విమానాశ్రయం మినహా అన్నింటినీ సాధించాం
-ఏదో ఒక రోజు కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పుతారు
-మహబూబ్ నగర్ కు కేసిఆర్ ఎయిర్ పోర్ట్ తీసుకువస్తారు
– మహబూబ్ నగర్ లో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భూమి పూజ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్, డిసెంబర్ 22: ఒకప్పుడు వైద్యం కోసం హైదరాబాద్ వెళుతుంటే మార్గమధ్యలో అప్పన్నపల్లి రైల్వే గేట్ పడటం కారణంగా సకాలంలో చికిత్స అందక అనేకమంది ప్రాణాలు కోల్పోయారని… తెలంగాణ ఏర్పడిన తర్వాత మహబూబ్ నగర్ మెడికల్ హబ్ గా తీర్చిదిద్దామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ పాత కలెక్టరేట్ ఆవరణలో రూ.300 కోట్లతో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తో కలిసి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు… ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అంటే పేదరికానికి వలసలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేదని, తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి ఖిల్లాగా మారిందని తెలిపారు. వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడిన దశ నుంచి నేడు మెడికల్ టూరిజం ఏర్పాటు ద్వారా వైద్యం కోసం విదేశాల నుంచి తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క మెడికల్ కళాశాల మంజూరు చేయకపోయినా… రాష్ట్రంలోని మొట్టమొదటి మెడికల్ కళాశాలను మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఉమ్మడి జిల్లాలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల లేని దశ నుంచి నేడు మూడు కళాశాలలు ఏర్పడ్డాయని, త్వరలో మరో రెండు కళాశాలలు కూడా ఏర్పాటు కానున్నాయన్నారు. పాత కలెక్టరేట్ స్థానంలో ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న 1000 పడకల సూపర్ స్పెషాలిటీ నూతన హాస్పిటల్ వల్ల అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి రావడమే కాకుండా బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి రోగులు కూతవేటు దూరంలో హాస్పిటల్ చేరుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. ప్రస్తుతం రూ. 300 కోట్లతో ప్రారంభమైన ఈ హాస్పిటల్ భవిష్యత్తులో రూ. 500 కోట్లకు పైగా ఖర్చుపెట్టి అత్యధిక సదుపాయాలన్నీ కల్పిస్తామన్నారు.
వైద్య రంగంలో ఎంతో ప్రగతి సాధించామని వైద్యం వైద్యం అందక ఒక్కరు కూడా చనిపోయే పరిస్థితి రావద్దన్నారు. మహబూబ్ నగర్ కు ఉమ్మడి జిల్లా నుంచి కాకుండా కర్ణాటక నుంచి కూడా వైద్యం కోసం రోగులు తరలివస్తున్నారని మంత్రి వివరించారు. కనీసం తాగునీరు కూడా అందని మహబూబ్ నగర్ గత పరిస్థితిని చూసి ఒక పెద్దాయన ఈ పట్టణం ఖాళీ అవుతుందని ఇక్కడ ఎవరు? ఇండ్లు కట్టుకోవద్దని సలహాలు ఇచ్చేవారని… తెలంగాణ ఏర్పడిన తర్వాత అదంతా తప్పుని తేలి పోయిందన్నారు.
సమైక్యరాష్ట్రంలో మన పేదరికాన్ని చూపి అప్పులు తీసుకువచ్చి నిధులను కోస్తాంధ్రకు తరలించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ కు సమీపంలో ఉండడం వల్ల అభివృద్ధి జరగడంలేదని, కృష్ణానది దిగువన ప్రవహిస్తున్నందున తాగునీరు అందడం లేదని గత పాలకులు కల్లబొల్లి కబుర్లు చెప్పేవారని, స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత అవన్నీ తప్పని నిరూపించి అభివృద్ధి చేసుకున్నామన్నారు. దేశంలోని అతిపెద్ద అర్బన్ ఎకో పార్క్ గా కెసిఆర్ అర్బన్ ఎకో పార్క్ నిలిచిందని తెలిపారు. రోడ్లు, మౌలిక వసతులు, పర్యాటకం, వైద్యం, విద్యలో మహబూబ్ నగర్ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు.
ఒకప్పుడు వలసల జిల్లాగా ఉంటే ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలసలు వస్తున్నారని తెలిపారు. మహబూబ్ నగర్ లో విమానాశ్రయం మినహా అన్నింటినీ సాధించామన్నారు. ఏదో ఒక రోజు కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పుతారని… అప్పుడు విమానాశ్రయం సాధించడం ఏమాత్రం కష్టం కాబోదన్నారు.
స్థానికంగా ఉన్న ఒక్కగానొక్క కాటన్ మిల్లు మూతపడినా… దేశంలోనే అతిపెద్ద బ్యాటరీ పరిశ్రమ అమర రాజా లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమను ఇక్కడకు తీసుకువచ్చామన్నారు. దీంతో పాటు హన్వాడ ఫుడ్ పార్క్ , ఐటీ పార్క్ వల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు విస్తృతం అవుతాయన్నారు. భారత్ మాలను అడ్డుకున్నా… చించోలి బైపాస్ త్వరలో ప్రారంభం అవుతుందన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు కెసిఆర్ కృషి చేయడం వల్లే ఈమధ్యనే మహబూబ్ నగర్ కు రైల్వే డబుల్ లైన్ పూర్తయిందన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం ఒక గంటలో చేరుకునే సదుపాయం ఉన్న మహబూబ్ నగర్ కు భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నారు.
మంత్రి హరీష్ రావు దృష్టంతా అభివృద్ధిపైనే ఉంటుందని… అదే తీరుగా తాము సైతం రాత్రి పగలు తేడా లేకుండా అభివృద్ధి వైపే లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు. తల్లికి బిడ్డ పై ఉన్న మమకారం ఎలా ఉంటుందో ఎంతో పోరాడి కష్టపడి సాధించుకున్న తెలంగాణ పట్ల కెసిఆర్ ప్రేమానురాగాలు కూడా అలాగే ఉంటాయని మంత్రి ఉదాహరించారు. మహబూబ్ నగర్ కు పారా మెడికల్ కాలేజీ, నర్సింగ్ కళాశాల కోసం భవనం మంజూరు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హరీష్ రావును కోరారు. మహబూబ్ నగర్ అభివృద్ధికి తనతో కలిసి వస్తున్న స్థానికులకు, సహకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి హరీశ్ రావు కామెంట్స్…
300 కోట్లతో 1000 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉంది.తెలంగాణ వచ్చాక మొట్టమొదటి మెడికల్ కాలేజీ పాలమూరుకే వచ్చింది.నర్సింగ్ కాలేజీకి ప్రారంభించుకున్నం. పర్మినెంట్ బిల్డింగ్ కోసం 50 కోట్లతో శంకుస్థాపన చేసుకుందాం.మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్ గారి కోరిక మేరకు పారా మెడికల్ కోర్సు కూడా ఈ ఏడాది ప్రారంభించుకుంటాం. తెలంగాణ వస్తది అంటే ఎవరు నమ్మలేదు. బి అర్ ఎస్ ఢిల్లీలో క్రియాశీలక శక్తిగా ఎదుగుతుంది. ఎలాంటి సందేహం లేదు.
కల్వకుర్తి, నెట్టం పాడు, బీమా పుర్తి చేసి అరు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం.చంద్రబాబు దత్తత తీసుకున్నారు పాలమూరును ఏం చేశారు.ఇక్కడి నుండి జాతీయ స్థాయి నాయకులు ఉన్నా ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు.ఒకే జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలు. దేశంలోనే ఇలా ఒక జిల్లాలో ఇన్ని లేవు.సీఎం కేసీఆర్ గారి వల్ల సాధ్యం అయ్యింది.26 పీజీ సీట్లు వచ్చి పీజీ కాలేజీ కూడా వచ్చింది.60 ఏళ్లలో 3 మెడికల్ కాలేజీలు ఉంటే, 8 ఏళ్లలో 12 మెడికల్ కాలేజీలు ప్రారంబించారు సీఎం గారు.కేంద్ర మంత్రి మేహెంద్ర నాథ్ వచ్చి ఇక్కడ ఆసుపత్రి గురించి మాట్లాడడిండు.చివరి స్థానంలో ఉన్న ఉత్తర ప్రదేశ్ వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు.
157 మెడికల్ కాలేజీల్లో మీరు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకున్న సొంత డబ్బుతో రాష్ట్రం ఏర్పాటు చేసింది.తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు కేంద్రం కాపీ కొట్టింది.మొన్ననే 969 పోస్టులు భర్తీ అయ్యింది. ఈ నెలాఖరు లోపు వారందరూ విధుల్లోకి వస్తారు.1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ ఇచ్చాము. త్వరలో భర్తీ చేస్తాం.
సీఎం కేసీఆర్ పాలనలో.పాలమూరు పచ్చ బడ్డది.వలసలు వాపస్ అయునవి.బొంబాయి బస్సులు బంద్ కాగా, గంజి కేంద్రాల అవసరం లేకుండా పోయింది.నాడు పల్లె పల్లేనా పల్లెర్లు మొలిచే పాలమూరులోనా కవులు పాటలు రాస్తే,నేడు, పాలమూరు తల్లి పచ్చ కొంగు కప్పుకున్నది అని పాటకు రాసే పరిస్థితులు వచ్చాయి.
కరువు ప్రాంతంగా పేరొందిన ఉమ్మడి పాలమూరు జిల్లా జలవనరులతో కళకళలాడుతున్నది.ఉపాధి లేక విలవిలలాడిన ఈ నెల ఉపాధికి కేరాఫ్ అడ్రస్ గా ఎదుగుతున్నది.పాలమూరు పచ్చబడితే కొంతమంది కళ్లు ఎర్రబడుతున్నాయి .ఇక్కడి పొలాల్లో నీరు పారుతుంటే కొంతమంది గుండెలు మండుతున్నాయి.అందుకే ఇక్కడికి వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
కృష్ణా నదిలో వాటా తేల్చండి అంటే ఇప్పటికి వరకు నోరు మెదపలేదు. ఇక్కడి బిజెపి ఎంపీలు ఒక్కనాడు మాట్లాడరు.మీకు అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు లేదు.వాటా తెల్చితే ఈ కోర్టు ఉండదు. ట్రిబ్యునల్ ఉండదు. పంచాయతీ ఉండదు.రూల్ ప్రకారం, ధరకాస్తు చేశాక ఏడాదిలోగా పరిష్కారం చూపాలి కానీ అలా చేయరు.మోడీ పాలమూరుకు వచ్చి మాట్లాడిండు. పాలమూరు ప్రజయూపీఏ కట్టలేదు అన్నాడు. మరి మీరు ఎందుకు కట్టడం లేదు.
నికర జలాలు కేటాయిస్తే కేసులు ఉండవు. ట్రిబ్యునల్ ఉండవు. ఎందుకు ఆలస్యం జరుగుతున్నది. 78 శాతం ఉన్న కృష్ణా నది వాటా తేల్చండి అంటే పట్టించుకోరు.కేంద్రంలో ఉన్న డబుల్ ఇంజిన్ లెక్క చెబుతాను. 8 ఏళ్ల కేంద్ర, రాష్ట్ర పాలనలో తేడా చూడండి.
జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్ సీట్లు 71శాతానికి పెరిగితే, తెలంగాణలో 127శాతం పెరుగుదల నేషనల్ మెడికల్ పీజీ సీట్లు పెరుగుదల 68శాతం అయితే, తెలంగాణలో పెరుగుదల శాతం 112శాతం.
కేంద్ర మంత్రులు వచ్చి మనకు నీతులు చెబుతారు. సూపర్ స్పెషాలిటీ సీట్లు కూడా మహబూబ్ నగర్ కి కూడా వస్తుంది.తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నాం.సీఎం కు ఉన్న ప్రేమ చంద్రబాబు, మోడీ, బిజెపి నాయకులకు ఉండదు.తెలంగాణ మట్టిలో పుట్టిన బిడ్డ, తెలంగాణ మట్టిలో కలిసిపోయే బిడ్డ సీఎం కేసీఆర్ ఆయనకున్న ప్రేమ ఇంకెవరికి ఉండదు.పారాసైట్ లాగా వచ్చిపోయే నాయకులకు మన మీద ప్రేమ ఉండదు. వైద్యులు ప్రేమతో ఆప్యాయతతో రోగులను పలకరించాలి. నమ్మకంతో వచ్చిన పేద ప్రజలకు మంచి వైద్యం అందించి మనసు చూరగొనాలనీ కోరుతున్నాను.
ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మా రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, కే దామోదర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇంతియాజ్, డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మాజీ శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, వైద్య విద్య సంచాలకులు రమేష్ రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, తదితరులు పాల్గొన్నారు.