Suryaa.co.in

Telangana

ఓయులో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయండి

– డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు ఉద్యోగుల వినతి

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని హాస్టళ్ళు, మేస్ లలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను వెంటనే క్రమబద్దేకరించేలా కృషి చేయాలని ప్రోగ్రెసివ్ కాంట్రాక్టు , క్యాసువల్ వర్కర్స్ యూనియన్ తెలంగాణా ఉప సభాపతి పద్మారావు గౌడ్ కు విజ్ఞప్తి చేశారు. యునియన్ అధ్యక్షురాలు పద్మ నేతృత్వంలో ని ఓ ప్రతినిధుల బృందం గురువారం ఉప సభాపతి పద్మారావు గౌడ్ ను సితాఫలమండీ లోని అయన క్యాంపు కార్యాలయంలో కలిసి ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని అందించింది. సుమారు 20 హాస్టల్స్, మెస్సుల్లో 375 మంది సిబ్బంది పని చేస్తున్నారని, ఉద్యోగ భద్రతను కల్పించి వారి సర్వీసులను క్రమబద్దేకరించాలని పద్మ, కౌసర్ బేగ్, లక్ష్మి, అమ్జాద్ అలీ, వెంకటేశ్, తదితరులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు. యూనివర్సిటీ సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తామని, వారి సమస్యలను అవసరమైన పక్షంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువేలతామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

LEAVE A RESPONSE