-
బాలినేనిని బుజ్జగిస్తున్న అల్లుడు జగన్
-
గతంలో బాలినేనికి అపాయింట్‌మెంట్ ఇవ్వని వైనం
-
ఓడినా పిలిచి మాట్లాడని జగన్ పై బాలినేని ఫైర్
-
పార్టీ మార్పు వార్తలతో మామను పిలిచిన అల్లుడు
-
తన ‘లెక్క’ తనకివ్వాలన్న బాలినేని
-
అప్పుల్లో ఉన్నానని ఆవేదన
-
వైజాగ్ క్వారీని గతంలో జగన్‌కు అమ్మేసిన బాలినేని
-
ఆ డబ్బు కూడా ఇవ్వని జగన్
-
నేనూ నష్టపోయా, డబ్బుల్లేవన్న జగన్
-
మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నామని ధీమా
-
గుంటూరులో వచ్చిన జనాలకు వివరించిన జగన్
-
పదవి వద్దు నాపైసలు నాకిమ్మన్న బాలినేని
-
కుర్చీ విసిరేసి వెళ్లిన బాలినేని
-
సజ్జల, కెఎన్నార్ బుజ్జగించినా వినని బాలినేని
-
బాలినేని జనసేనలో చేరిక ఉత్తిదేనట
( మార్తి సుబ్రహ్మణ్యం)
వైసీపీలో మామా అల్లుళ్ల పంచాయితీ నడుస్తోంది. వైసీపీ అధినేత జగన్-మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మామా అల్లుళ్లన్నది తెలిసిందే. చిల్లర రాజకీయాలు కాకుండా, ముక్కుసూటిగా వ్యవహరించే బాలినేని వ్యవహారశైలి జగన్‌కు పూర్తి విరుద్ధం. బాలినేనికి అన్ని పార్టీల్లోనూ ఆత్మీయ మిత్రులున్నారు. ఒకరకంగా ఆయన రాజకీయాల్లో అజాతశత్రువు. పార్టీలకు అతీతంగా పనులుచేసే ఆయనకు, ఎన్నికల సమయంలో ఇతర పార్టీ నేతలు కూడా విరాళాలు ఇస్తారన్నది బహిరంగ రహస్యం.
అలాంటి బాలినేని తన అల్లుడైన జగన్‌ను నమ్ముకుని, ఆర్ధికంగా పూర్తిగా నష్టపోయారు. చివరకు ఆయన కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకునే, వైజాగ్‌లోని క్వారీని కూడా ఎన్నికల ముందు జగన్ తీసేసుకున్నారు. ఎన్ని ల్లో ఇస్తానన్న నిధులు కూడా ఇవ్వకుండా చేతులెత్తేసిన అల్లుడు జగన్‌పె,ై బాలినేని పీకల్లోతు కోపంతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో గుంటూరు సబ్‌జైల్లో ఉన్న మాజీ ఎంపి నందిగం సురేష్‌ను పరామర్శించిన జగన్, సాయంత్రానికి బాలినేనిని పిలిపించారు. అంతకుముందు జగన్‌ను కలిసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేదు. ఈలోగా బాలినేని జనసేనలోకి వెళుతున్నారన్న ప్రచారం మీడియాలో ఉధృతంగా రావడంతో, జగన్ తన మామ బాలనేనిని తాడేపల్లికి పిలిపించారు.
ఆ సందర్భంగా.. నువ్వు, పెద్దిరెడ్డి, బొత్స జిల్లా అధ్యక్షులుగా పనిచేయండి అని కోరినప్పుడు బాలినేని తన అల్లుడు జగన్‌పై విరుచుకుపడినట్లు తెలిసింది.
నువ్వు వద్దు.. నీ పార్టీ వద్దు. నా లెక్క నాకు ఇచ్చెయ్. నిన్ను నమ్మి అంతా నష్టపోయాం. అప్పుడు మేం చెప్పినా నువ్వు వినలేదు. నన్ను కాదని మంత్రి పదవి ఇచ్చినోళ్లు ఇప్పుడెక్కడున్నారు? అందరినీ నాశనం చేశావు. నీ వల్ల నేను ఇల్లు అమ్ముకున్నా. వైజాగ్‌లో తీసుకున్న నా క్వారీ లెక్క నాకు ఇచ్చెయ్. ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు. నాకు నువూ వద్దూ.. నీ పార్టీ వద్దు అని నిర్మొహమాటంగా చెప్పినట్లు సమాచారం.
అన్నీ విన్న జగన్.. మామా నేనూ బాగా నష్టపోయా. అప్పులపాలయ్యా. నా దగ్గరా డబ్బు లేదు. వచ్చే ఎన్నికల్లో నేను ఎవరికీ డబ్బులివ్వను. అయినా నాలుగేళ్లు ఓపిక పట్టు. మళ్లీ మనమే వస్తాం. ఈరోజు గుంటూరులో వచ్చిన జనాలను చూశావా? జనం మనవైపే ఉన్నారు. రేపు ఎన్నికలు పెట్టినా మనమే వస్తాం . వాళ్ల పార్టీలో ఎంత అసంతృప్తి ఉందో నువ్వే చెప్పు. చంద్రబాబు ఎవరికీ పదవులివ్వడు. ట్రాన్సఫర్లలో ఎమ్మెల్యేల మాట చెల్లడం లేదని ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. మనం అట్ల చేశామా? ఆ పార్టీని మనమేం చేయనవసరం లేదు. అదే వీకయిపోతుంది. నేను వచ్చే నెల నుంచి మళ్లీ రాష్ట్రంలో తిరుగుతా. మీలాంటి సీనియర్లంతా జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకోండి. తర్వాత మిమ్మల్ని నేను చూసుకుంటా’నని కూల్‌గా చెప్పారట.
దానితో తన డబ్బు తనకు రాదన్న ఆగ్రహంతో రగిలిపోయిన బాలినేని.. అక్కడున్న కుర్చీని విసిరేసి, విసురుగా బయటకు వెళ్లారట. బయట ఉన్న జగన్ పీఏ కెఎన్‌ఆర్.. సార్ రేపు జిల్లాల మీటింగు ఉంది. మీరు రావాలి అని చెప్పడంతో, మండిపోయిన బాలినేని.. ఇప్పుడే మీవాడికి చెప్పా. నాకు మీరూ వద్దు. మీ పార్టీ వద్దు అని వెళ్లిపోయారు.
తర్వాత సజ్జల ఆయనను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. మీరంతా వందల కోట్లు సంపాదించి.. మిమ్మల్ని నమ్ముకున్న మమ్మల్ని రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారట. తర్వాత మళ్లీ ఫోను చేసి, నీ నిర్ణయం కోసమే జిల్లాల మీటింగ్ వాయిదా పడిందని సమాచారం ఇచ్చారని తెలిసింది.
అయితే జగన్‌వ్యవహారశైలిపై బాలినేనికి పీకల్లోతు కోపం ఉన్నప్పటికీ, ఆయన ఇప్పట్లో వైసీపీని వీడే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారిద్దరి మధ్య ఈ పంచాయతీ నిరంతరం నడుస్తుంటుందని, అల్లుడిపై మామ అలగడం మామూలేనని, బాలినేని సమర్ధత జగన్‌కు తెలుసని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నిజానికి బాలినేనికి అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉంది. అయినప్పటికీ బాలినేని జనసేనకు వెళ్లకపోవచ్చని, అది బాలినేనికి గిట్టని సుబ్బారెడ్డి వర్గం చాలాకాలం నుంచి, మీడియాలో చేస్తున్న ప్రచారమేనంటున్నారు.