– మళ్ళీ అధికారులను పంపిస్తాం
– మంత్రి నారాయణ
విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపేందుకు మున్సిపల్ అధికారులు, కార్మికులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నగరంలోని కండ్రిక, వుడా కాలనీ, జర్నలిస్టు కాలనీ లో పలు ప్రాంతాల్లో ఇప్పటికి ఇళ్ల మధ్యలో వరద నీరు ఉంది. ఒక వైపు మోటార్ల తో పంపింగ్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల రోడ్లకు గండ్లు కొట్టి నీటిని బయటికి పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. స్వయంగా బైక్ నడుపుకుంటూ వరద నీటిలోకి వెళ్ళి మంత్రి నారాయణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇదిలావుండగా, నారాయణ మీడియాతోతో ఏమన్నారంటే…
బుడమేరు ప్రవాహానికి ఆటంకాలు లేకుండా ప్రొక్లయినర్ లతో పూడిక తొలగింపు. 64 వ డివిజన్ లో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇంకా ఉంది. వరద నీటిని బయటకు ఎలా పంపించాలని దానిపై నిన్నటి నుంచి అధ్యయనం చేశాం. వుడా కాలనీ వెనుక కట్టకు అడ్డుకట్ట వేయాలని అధికారులకు సూచించాను. శుక్రవారం రాత్రి మొత్తం వరద నీరు పూర్తిగా తగ్గిపోతుంది. వరద ప్రాంతాల్లో ఎన్యుమరేషవ్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. మా ఇంటికి ఎన్యుమరేషవ్ చేయలేదని ఎవరూ ఆందోళన చెందవద్దని, జరగని ప్రాంతాల్లో ఆయా ఇళ్ళకు వెళ్లి ఎన్యుమరేషవ్ చేసేలా మరోసారి సిబ్బందికి అదేశాలిస్తాం. నష్టం అంచనాలు పూర్తి కాగానే బాధితులకు పరిహారం అందిస్తాం.