Suryaa.co.in

Andhra Pradesh

జగ్గయ్యపేటలో వైసీపీకి షాక్!

– టీడీపీలోకి మున్సిపల్ చైర్మన్
– రాఘవేంద్ర సహా వార్డు కౌన్సిలర్లు
– కండువాకప్పి ఆహ్వానించిన మంత్రి లోకేష్

అమరావతి: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వైసీపీ సిద్ధాంతాలు, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి విధ్వంసక విధానాలు నచ్చక పలువురు ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఆ పార్టీకి తగిలింది. అక్కడి మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం నర్సింహారావు మంత్రి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ)లో చేరారు.

వారితో పాటు ఏడో వార్డు కౌన్సిలర్ పూసపాటి సీతారావమ్మ దంపతులు, 31వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు, కుమారుడు కృష్ణ, 23వ వార్డు కౌన్సిలర్ డి.రమాదేవి దంపతులు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ పడని విధంగా భారీ వర్షాలు కురిశాయి. ప్రభుత్వ అప్రమత్తంగా వ్యవహరించి బాధితులకు అండగా నిలిచింది. వరదలోనూ జగన్ రెడ్డి బురద రాజకీయాలు చేశారని మండిపడ్డారు.

LEAVE A RESPONSE