Suryaa.co.in

Andhra Pradesh

కాకినాడ, రాజమండ్రిలో హెచ్‌ఆర్‌సీ క్యాంపు కోర్టు నిర్వహణ…

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జూన్ 27 నుంచి జూలై 1వ తేదీ వరకు క్యాంపు కోర్టు నిర్వహించనున్నట్లు కమిషన్ కార్యదర్శి సంపర వెంకట రమణ మూర్తి ప్రకటించారు. ఈ క్యాంపు కోర్టు నందు కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి , కమిషన్ సభ్యులు (నాన్ జుడీషియల్) డాక్టర్ శ్రీనివాస రావు గోచిపాత పాల్గొన్ని ఆయా తేదీల్లో కేసుల విచారణ , నూతన కేసుల స్వీకరణ, అవగాహన సదస్సుల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రమణ మూర్తి వెల్లడించారు.

జూన్ 27,28 తేదీ లలో కాకినాడ జిల్లా కేసుల విచారణలు కాకినాడ కలెక్టరేట్ నందు క్యాంపు కోర్టు నిర్వహణ జరుగనున్నట్లు. అదేవిధంగా జూన్ 29,30 తేదీల్లో రాజమండ్రి (రాజమహేంద్రవరం) కోనసీమ జిల్లాల కేసుల విచారణ రాజమండ్రి (రాజమహేంద్రవరం) లోని సబ్ కలెక్టర్ వారి కార్యాలయం నందు జరుగుతుందన్నారు. అనంతరం జూలై 1వ తేదీన రాజమండ్రి (రాజమహేంద్రవరం) లోని సబ్ కలెక్టర్ వారి కార్యాలయం నందు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు…

క్యాంపు కోర్టుకు సంబంధించిన ఇతర వివరముల కొరకు క్యాంపు కోర్టు నోడల్ ఆఫీసర్ /కమిషన్ విభాగాధికారి
బొగ్గరం తారక నరసింహ కుమార్ 9440788389.
నల్లమిల్లి శ్రీనివాసుల రెడ్డి 9866238234. లను కేసులకు సంబంధించిన వివరాల కోసం ఈ నెంబర్ లలో సంప్రదించవచ్చని వారు తెలిపారు…

 

LEAVE A RESPONSE