Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ పాలనలో మడ అడవులను రొయ్యల చెరువులు గా అమ్మేసారు

విజయవాడ: వైసీపీ హయాం లో 1,500 ఎకరాల్లో మడ అడవి ని ధ్వంసం చేసి అమ్మకాలు సాగించారని వారిలో బిజెపి నేతలకు ఫిర్యాదు చేశారు.

అక్రమంగా అక్వా చెరువుల తవ్వకం సముద్రం మొదలు కలిసే చోట ఏర్పడే చిత్తడి నేలల్లో మడ అడవులు వృద్ధి చెందుతాయి. ఇవి తీర ప్రాంత కోతను నివారించడంతో పాటు తుపానులు, సునామీ వంటి ప్రకృతి విపత్తులు సంభవించినపుడు వాటి తీవ్రతను తగ్గించేందుకు పెట్టని కోటలుగా నిలుస్తాయి. అంతటి ప్రాధాన్యత వున్న మడ అడవులను గత వైసీపీ ప్రభుత్వ నేతల ధన దాహానికి అక్రమ కబ్జాలకు గురైంది. కృష్ణా జిల్లా పెడన నియోజక వర్గంలో సముద్ర తీర ప్రాంతంలో జరిగిన మడ విధ్వంసమే అందుకు నిదర్శనం.

స్ధానిక వైసీపీ మంత్రి ఆధ్వర్యంలో గత అయిదేళ్లలో కృత్తివెన్ను మండలంలో దాదాపు 1,500 ఎకరాలు మడ అడువులను నరికి చేపల చెరువులు అక్రమంగా తవ్వి కోట్ల రూపాయలు ఆర్జించారు. కృత్తివెన్ను మండలం గుడిసెపూడి పంచాయతీలో 250 ఎకరాలు, నిజమర్రులో 300 ఎకరాలు, వర్లగొందితిప్పలో 300 ఎకరాలు, చిన్న గొల్లపాలెం తీరప్రాంతంలో 500 ఎకరాల మడ అడవులు బఫర్‌జోన్‌ మాయం చేశారు. వాటి స్ధానంలో ఆక్వా చెరువులు అక్రమంగా తవ్వించి ఎకరానికి 30 వేల చొప్పున లీజులకు ఇచ్చారు.

ఇలా 1,500 ఎకరాలకు గాను రూ.5 కోట్ల రూపాయలు చేతులు మారింది. ఇంత జరుగుతున్నా అటవీ రెవిన్యూ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. మడ అడువులను నరికేసి తవ్విన చెరువులకు అక్రమ విద్యుత్తు కనెక్షన్లు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో అక్రమ చెరవులకు కొన్నిటికి పట్టాలు కూడా ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. కావున ఈ విషయంపై తక్షణం ప్రభుత్వ పరమైన విచారణ చేసి మడ అడవులను తిరిగి ఏర్పాటుచేసి పర్యావరణానికి తోడ్పడాల్సిందిగా అక్రమదారులను కఠినంగా శిక్షించాలని కోరుచున్నాము. అంటూ అదే ప్రాంతానికి చెందిన శ్రీ నివాస్, కళ్యాణ్, గణేష్ తదితరులు ఫిర్యాదు చేశారు.

అదేవిధంగా ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు ఫ్లాట్ లను కూడా అమ్మేసారు.లబ్థిదారుడు ఒకరైతే మరొకరికి అమ్మారు వీటి పైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదు స్వీకరించిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, బిజెపి కోర్ కమిటీ సభ్యులు చంద్ర మౌళి హామీ ఇచ్చారు. అనకాపల్లి, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, నెల్లూరు జిల్లా లో నుండి అనేక ఫిర్యాదు లు వచ్చాయి.వారధి కో ఆర్డినేటర్ కిలారు దిలీప్ ఫిర్యాదు దారులను సమన్వయం చేసారు

LEAVE A RESPONSE