టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చెక్కు అందజేత
అమరావతి :- ఎన్టీఆర్ ట్రస్ట్ అనుబంధ విభాగమైన ఎన్టీఆర్ ఫౌండేషన్ కు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన్ కృష్ణ రూ.2 కోట్లను విరాళంగా అందించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును సోమవారం ఉండవల్లి నివాసంలో కలిసి చెక్కు అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఎంతో మంది పేద విద్యార్థులను ట్రస్టు ద్వారా చదివిస్తున్నారన్నారని మోహన్ కృష్ణ అన్నారు. విరాళం అందించిన మోహన్ కృష్ణను చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు వేమూరి రవి, ఎన్ఆర్ఐ గొట్టిపాటి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.