-హర్యానాలో బీజేపీ-జేజేపీ పొత్తుకు బీటలు
-ఆసక్తికరంగా హర్యానా పాలిటిక్స్
లోక్సభ ఎన్నికల ముంగిట హర్యానా రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు.
బీజేపీ-జననాయక్ జనతా పార్టీ కూటమిలో చీలికలు రావడంతో సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు. అంతే కాకుండా ఖత్తర్ బాటలోనే ఆయన క్యాబినెట్ మంత్రులు కూడా రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అర్జున్ ముండా, బీజేపీ సీనియర్ నేత తరుణ్ చుగ్ హుటాహుటిన హర్యానా వెళ్లారు. బీజేపీ-జేజేపీ చీలిపోయినా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు ఉండదని భావిస్తున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు మనోహర్ లాల్ ఖట్టర్ సర్కార్‌కు మద్దతు ఇస్తున్నారు.
90 స్థానాలు ఉన్న హరియాణా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, హర్యానా లోక్‌హిత్ పార్టీ-HLPకి చెందిన ఒకఎమ్మెల్యే కూడా బీజేపీకి మద్దతిస్తున్నారు. దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ-JJPకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.