జ‌గ‌న్ నుంచి ప్రాణ హాని ఉంది

-ర‌క్ష‌ణ కోసం సీబీఐ కోర్టులో ద‌స్త‌గిరి పిటిష‌న్‌
-సీబీఐ త‌న కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని విన‌తి
-ఎంపీ అవినాశ్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని దస్తగిరి మరో పిటిషన్

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా ఉన్న ద‌స్త‌గిరి సీబీఐ కోర్టులో ప్రొటెక్ష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని, ర‌క్ష‌ణ క‌ల్పించేలా ఆదేశించాల‌ని అందులో పేర్కొన‌డం జ‌రిగింది.

త‌న కుటుంబానికి ఏపీ సీఎం జ‌గ‌న్‌, ఆయ‌న భార్య భార‌తి, అవినాశ్ రెడ్డి, దేవిరెడ్డి శివ‌శంక‌ర్ రెడ్డి, ఆయ‌న కుమారుడు చైత‌న్య రెడ్డి నుంచి ప్రాణ హాని ఉంద‌ని పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. సీబీఐ త‌న కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరాడు. ఈ పిటిష‌న్‌పై మ‌ధ్యాహ్నం సీబీఐ కోర్టు విచార‌ణ చేప‌ట్ట‌నుంది. మ‌రోవైపు ఎంపీ అవినాశ్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని ద‌స్త‌గిరి హైకోర్టులో పిటిష‌న్ వేశాడు.

Leave a Reply