అత్యాచారానికి గురైన దళిత బాలికకు టీడీపీ బృందం పరామర్శ

Spread the love

-వైసీపీ నాయకుడి చేతిలో అత్యాచారానికి గురైన దళిత బాలికకు టీడీపీ బృందం పరామర్శ
– కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు

వైసీపీ నేత కన్నా భూశంకర్ రావు చేతిలో అత్యాచారానికి గురైన దళిత బాలికను శనివారం టీడీపీ బృందం పరామర్శించనుంది. బాధితురాలికి న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. గుంటూరు జిల్లా పేరేచర్లకు చెందిన బాలికను కరోనా వైద్యం పేరుతో వంచించి ఆమెపై అఘాయిత్యం చేసిన భూశంకర్ రావును ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి.

మృగాళ్ల నుంచి తప్పించుకున్న బాలిక స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసే దాకా పోలీసులకు ఏం జరిగిందో తెలియలేదంటే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తోందో అర్ధమవుతోంది. ప్రభుత్వ, పోలీసులు ఉదాసీనత నేరస్థులకు అస్త్రంగా మారింది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కామాంధుల్లా అఘాయిత్యాలకు తెగపడుతుంటే తామేమి తక్కువ అన్నట్టు వైసీపీ నాయకులూ అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. మూడేళ్ల వైసీపీ పాలనలో మహిళలపై 1500కు పైగా అత్యాచారాలు, దాడులు జరిగినా ఒక్కరికీ శిక్షపడలేదు.

ముఖ్యమంత్రి నివాసం పక్కన యువతి గ్యాంగ్ రేప్, పెదకాకానిలో నడిరోడ్డుపై పట్టపగలు దళిత విద్యార్థిని హత్య, నరసరావుపేటలో బీటెక్ విద్యార్థిని నరికి చంపడం వంటి ఘటనలు జరిగి ఏడాది కావొస్తున్నా ఇప్పటివరకూ ఒక్క నేరస్థుడినీ ప్రభుత్వం పట్టుకోలేకపోయింది. మహిళా హోంమంత్రి ఉండీ సాటి మహిళకు భద్రత లేకుండాపోతోంది. ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రచారం చేసిన దిశా చట్టం ఏమైపోయింది. నేరస్థుడు భూశంకర్ రావును దిశా కింద ఉరితీయాలి.పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు బాలికను వంగలపూడి అనిత, ఆచంట సునీత, పీతల సుజాత, అన్నాబత్తుని జయలక్ష్మి, తెనాలి శ్రావణ్, ఎంఎస్ రాజు పరామర్శిస్తారు.

Leave a Reply