– • రఘురామకృష్ణంరాజుని వేధిస్తున్నతీరు, అశోక్ గజపతిరాజుగారిని అవమానించిన విధానమే అందుకు నిదర్శనం
అశోక్ గజపతిరాజు విషయంలోప్రభుత్వం వ్యవహరించిన తీరు క్షమించరానిది
– మంత్రివెల్లంపల్లి తనతప్పు తెలుసుకొని, అశోక్ గజపతిరాజుగారికి బహిరంగక్షమాపణచెప్పాలి.
• రామతీర్థం ఆలయంతోపాటు దాదాపు 108 ఆలయాలకు అశోక్ గజపతిరాజు ధర్మకర్తగా ఉన్నారు.
• ఆశోక్ గజపతిరాజు, ఆయనకుటుంబీకులు డబ్బుగురించి ఆలోచించి పనులుచేయరు
• రామతీర్థం ఆలయఈవో హద్దులుమీరి ప్రవర్తించినందుకు భవిష్యత్ లో తగినమూల్యం చెల్లించుకుంటాడు
– టీడీపీ శాసనసభ్యులు మంతెన రామరాజు
రామతీర్థంలోని బోడికొండ ఆలయ అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతి రాజుని ఆహ్వానించకుండా, ఏపీప్రభుత్వం అక్కడ పునిర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం, భక్తులసాక్షిగా జిల్లాలోనే గొప్పకుటుంబంగా పేరుపొందిన పూసపాటివంశీయుల వారసుడిగా ఉన్న అశోక్ గజపతిరాజుగారిని అవమానించడం చూస్తుంటే, ప్రభుత్వం కావాలనే అలా వ్యవహరించినట్టుగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే మంతెనరామరాజు ఆరోపించారు. గురువారం ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
రామతీర్థం ఆలయంలో ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన పునర్నిర్మాణ పనుల్లో ఆదినుంచి పాలకులు ఆలయధర్మకర్త అయిన అశోక్ గజపతిరాజుగారిని పక్కనపెడుతూనేఉన్నారు. ఆయన్ని అగౌరవపరచాలన్న ఉద్దేశంతోనే పాలకులు దిగజారి ప్రవర్తించారు. ఆలయంలో ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఆలయధర్మకర్తకు సమాచారమివ్వరా? ఆయన పేరు లేకుండానే శిలఫలకాలు, బోర్డులుఏర్పాటుచేస్తారా? తనకు జరిగిన అవమానంపై అశోక్ గజపతిరాజు గారు ప్రశ్నిస్తే, తిరిగిఆయనపైనే తప్పుడుకేసులుపెట్టిస్తారా? ప్రభుత్వం, మంత్రులు చెప్పారని రామతీర్థం ఆలయ ఈవో హద్దులుమీరి ప్రవర్తించారు.
దానికి ఆయన భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వఅధికారి, అధికారిలా ఉండకుండా, ఆలయధర్మకర్తను అగౌరవపరిచే క్రతువులో భాగస్వామికావడం ముమ్మాటికీ క్షమించరాని విషయం. రామతీర్థం ఆలయంతోపాటు, దాదాపు 108వరకు దేవాలయాలకు అశోక్
గజపతిరాజుగారు ధర్మకర్తగా ఉన్నారు. ఆయన, ఆయనకుటుంబ గొప్పతనం గురించి మాటల్లో చెప్పలేము. లక్షలకోట్ల ఆస్తులను దానధర్మాలకు, దేవాలయాలకు వెచ్చించిన చరిత్ర వారిది. అలాంటికుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని అవమానించడం, అగౌరవపరచడాన్ని తమతో పాటు, యావత్ విజయనగరంజిల్లా ప్రజానీకం ముక్తకంఠంతో ఖండిస్తోంది.
ఉత్తరాంధ్రప్రాంతంలో పూసపాటి కుటుంబీకులు చేసిన అనేకగొప్పకార్యక్రమాలు, ఇప్పటికీ కళ్లముందు కనిపిస్తూనే ఉంటాయి. అశోక్ గజపతిరాజు గారు ఇప్పటికీ చాలాసాదా సీదాగా ఉంటారు.అలాంటి వ్యక్తులను గౌరవిస్తేనే, ప్రజలుకూడా ఈప్రభుత్వాన్ని గౌరవిస్తారని సూచిస్తున్నాం. క్షత్రియులపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందని చెప్పడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయని విలేకరులు అడిగినప్రశ్నకుసమాధానంగా రామరాజు గారు అభిప్రాయపడ్డారు.
సొంతపార్టీ ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజుని వేధించినతీరుగానీ, ఇప్పుడు అశోక్ గజపతిరాజుగారిని అవమానించిన విధానంగానీ చూస్తే, ముమ్మాటికీ క్షత్రియవర్గంపై జగన్మోహన్ రెడ్డి కక్షకట్టాడనే అనిపిస్తోంది. దేవాదాయమంత్రి అన్నంతినే మనిషిలా మాట్లాడటంలేదు. ఆయనస్థాయిని, వయస్సుని మర్చిపోయి ఇంగితంలేకుండా మాట్లాడి మంత్రివెల్లంపల్లి ప్రజలు ఛీకొట్టేస్థాయికి దిగజారాడు.
మంత్రివెల్లంపల్లే కాదు…ప్రభుత్వపెద్దలు,ఇతర మంత్రులు మాట్లాడేదానిపై ప్రజల్లో చర్చపెడితే వారు అందరినీ ప్రజలుఏకకంఠంతో ఛీకొడతారు. మంత్రి వెల్లంపల్లి తనవ్యాఖ్యలను ఉపసంహరించుకొని తక్షణమే అశోక్ గజపతిరాజుగారికి బహిరంగక్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మంత్రులు, కిందిస్థాయిప్రజాప్రతినిధులు ఇష్టానుసారం ప్రవర్తిస్తూ,నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి వారంచడంలేదు. ప్రభుత్వాని ప్రశ్నించినా, ముఖ్యమంత్రిని నిలదీసినా తెల్లారేసరికి ఇళ్లముందు పోలీసులు ఉంటున్నారు. పోలీసులసాయంతో ఎన్నాళ్లు ప్రభుత్వాన్ని నెట్టుకొస్తారో, ప్రశ్నించేవారిని ఇబ్బందులు పెడతారో చూస్తాము.