రైతు దినోత్సవం ఎందుకు చేసుకుంటున్నట్లు?

Spread the love

వేల కోట్ల రూపాయల ధరల స్తిరీకరణ నిధిని రైతు భరోసా పేరుతో వ్యవసాయం చెయ్యని వాడికి కూడా పంచి పెడుతున్నందుకా?
టమాట కిలో 50 రూపాయలు అంటే గుండెలు బాదుకుంటారు..
అదే టమాటా పావాలా కూడా కొనే దిక్కులేకపొతే జాలిపడేవాడు ఎవడు?
నకిలీ విత్తనాలు గురించి భాద్యత ఎవడికి?
దళారుల సంగతి పట్టింది ఎవడికి ?
రాయలసీమలో బ్రిటీష్ కాలం నుండి తిష్టవేసిన… చీనీ మార్కెట్లో సూటు పేరుతో 10 శాతం మింగేసే వ్యవస్తను రూపుమాపేదెవడు?
కౌలు రైతులకు వ్యవసాయం మీద కనీస పెట్టుబడి వస్తుందా?
పండించిన పంట అమ్ముకోవడానికి మార్కెటింగ్ యార్డుల దగ్గర రోజుల తరబడి రైతులు ఎందుకు జాగారం చేస్తున్నారు?
నిజమైన రైతులు మహానగరాలలో కూలిపని వారిగా ఎందుకు మారుతున్నారు?
మార్కెటింగ్ యార్డులలో ఒకనాటి సబ్సీడి ఎరువులు, పురుగు మందులు ఏమయ్యాయి?
అవసరానికి పనికొచ్చే టార్పాలిన్ పట్టాల సబ్సీడీ ఏమయ్యింది?
సుజనా చౌదరి పార్లమెంటులో ప్రశ్నించేదాక, చంద్రబాబు అసెంబ్లీలో నేల మీదకూర్చొని నిరసన తెలిపేదాకా..
పంటనష్టం భీమా చెల్లించాలి అని కూడా తెలియని రాజకీయ వ్యవస్థ ఉన్నందుకా?
పంట నష్టం డబ్బులు కూడా దొంగ పంటల నమోదు చేసుకొని పందికొక్కులుగా మింగుతున్నందుకా?
రుణమాఫీ తో ఇంట్లోకి స్కూటీ వచ్చింది…
రైతుభరోసాతో ఇంటికి కొత్త కొత్త మొబైల్ ఫొన్లు వస్తున్నాయి..
నిజంగా పొలంలో పంట పండించే రైతుకి దమ్మిడీ ఉపయోగమైనా ఉందా?
అనునిత్యం కష్టాలు సుడిగుండంలో కాలిపోతున్న రైతు వ్యవస్థ తొందరలోనే కనుమరుగు కానున్నట్లే..
ఒక రైతు కుటుంబం వలస వలసపోతే, ప్రత్యాన్మాయంగా మరొక కుటుంభాన్ని వ్యవసాయంలోకి మార్చగలరా?రైతుని చూడాలంటే కొండపల్లి బొమ్మలోనే చూడాలి భవిష్యత్తులో..

– రమేష్ నేలకుడితి

Leave a Reply