హైదరాబాద్: నూతన సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను పలువురు ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసాల వెంకటేష్, సంఘం నాయకుడు పిల్లి సంపత్, బీఆర్ఎస్ నాయకులు పోగుల నవీన్ పటేల్, దవులూరి ప్రసాద్ చౌదరి, తెలంగాణ ఉద్యమ నాయకుడు రాహూల్ దేశ్ పాండే తదితరులు ఎంపీ వద్దిరాజును కలిసి మొక్క అందజేసి శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.