న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే అన్ని డివిజన్ల పరిధిలో సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ పనులు చేపట్టింది. దీనిలో భాగంగా విజయవాడ డివిజన్ లో కూడా పనులు జరుగుతుండటంతో ఈ నెల రెండోతేదీ నుంచి 29వ తేదీ వరకు డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు సహకరించాలని విజయవాడ డివిజన్ అధికారులు కోరారు.
విజయవాడ, రామవరప్పాడు మధ్య పాక్షికంగా రద్దయిన రైళ్లు
మచిలీపట్నం-విజయవాడ (07896)
విజయవాడ-మచిలీపట్నం (07769),
నర్సాపూర్-విజయవాడ (07863),
విజయవాడ-మచిలీపట్నం (07866),
మచిలీపట్నం-విజయవాడ (07770),
విజయవాడ-భీమవరం జంక్షన్ (07283),
మచిలీపట్నం-విజయవాడ (07870),
విజయవాడ-నర్సాపూర్ (07861)
గుణదల, భీమవరం, నిడదవోలు మీదుగా దారి మళ్లించిన రైళ్ల వివరాలు
సెప్టెంబరు 2, 9, 16, 23 తేదీల్లో ఎర్నాకుళం – పాట్నా (22643),
7, 14, 21, 28 తేదీల్లో భావ్ నగర్ – కాకినాడపోర్ట్ (12756),
4, 6, 11, 13, 18, 20, 25, 27 తేదీల్లో బెంగళూరు – గౌహతి (12509) రైళ్లను దారి మళ్లించారు.
2, 4, 6, 7, 9, 11, 13, 14, 16, 18, 20, 21, 23, 25, 27, 28 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్ – భువనేశ్వర్ (11019), 2 నుంచి 29వరకు ధన్బాద్ – అలెప్పి (13351), 5, 12, 19, 26తేదీల్లో టాటా – యశ్వంత్పూర్ (18111)
సెప్టెంబరు 4, 11, 18, 25 తేదీల్లో జసిధి(జార్కండ్) – తాంబరం (12376),
2, 9, 16, 23 తేదీల్లో హాతియా – ఎర్నాకుళం (22837), 7, 14, 21, 28 తేదీల్లో హాతియా – బెంగళూరు (18637),
3, 8, 10, 15, 17, 22, 24, 29 తేదీల్లో హాతియా – బెంగళూరు (12835),
6, 13, 20, 27 తేదీల్లో టాటా – హాతియా (12889).
ఈ తేదీల్లో ప్రయాణికులు దారి మళ్లించిన రైళ్ల మార్గాలకు అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. విజయవాడ-గూడూరు డివిజన్ మధ్య, విజయవాడ-విశాఖపట్నం మధ్య మూడో రైల్వే లైను నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఆయా మార్గాల్లో కూడా కొన్నింటిని అధికారులు రద్దు చేశారు. అయితే ప్రయాణికుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో కొన్నింటిని పునరుద్ధరించారు.