Suryaa.co.in

Andhra Pradesh

బీజేపీలోకి భారీ చేరికలు

ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి కార్యాలయంలో నరేంద్రమోదీ పరిపాలనకు ఆకర్షితులై రాష్ట్ర బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీ కృష్ణ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా శింగనమల అసెంబ్లీ కి సంబంధించిన వైసీపీ నాయకులు గంగా రాజేష్ రెడ్డి పార్టీలోకి చేరడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

నూతనంగా పార్టీలోకి చేరిన వారిలో ప్రధానంగా గంగా రాజేష్ రెడ్డి అనుచరులతో చేరడం జరిగింది. పురంధేశ్వరి  మాట్లాడుతూ రాష్ట్రంలోని యువత అంత ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే దేశంలో నరేంద్రమోదీ పాలన ఒక్క అవినీతి కూడా లేకుండా ప్రభుత్వాన్ని నడపడం, అలాగే రాష్టంలో వైసీపీ పాలన చూసి విసిగిపోయారని ఒక్క యువతే కాదు అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు పార్టీలో చేరుతున్నారని, ముఖ్యంగా వైసీపీ లో ఉన్నవారు కూడ పార్టీలో చేరడం రాష్ట్ర పార్టీ పని తీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు.

కార్యక్రమములో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నవనీత్ , రాజు , రాష్ట్ర కార్యదర్శి ఆజేశ్ యాదవ్ , రాయలసీమ జోనల్ ఇంచార్జీ సూర్య ప్రకాశ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మంజుల వెంకటేష్, సాయి నాధ రెడ్డి, మనోహర్, వలి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE