Suryaa.co.in

Andhra Pradesh

సిసికెమెరా పెట్టిన నిందుతులను కఠినంగా శిక్షించాలి

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్

విజయవాడ: కళాశాల వాష్ రూం లలో సిసి కెమారాలు పెట్టిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన బిజెవైఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు.

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్ లో హిడెన్ కెమెరా ఘటన బాధాకరమైనది ఎవరైతే ఈ ఘటనకి బాద్యులు ఉన్నారో వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి .ఇలాంటివి పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఇటువంటి సంఘటనలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితిలు కల్పిస్తున్నాయి.

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి బిజెవైఎం రాష్ట్ర కార్యాశాల నుద్దేశించి మాట్లాడుతూ దేశంలో బీజేపీ 18కోట్ల సభ్యత్వంతో బలం గా ఉంది .ఏపీ లో 2014 లోనే 27లక్షల మంది సభ్యత్వం జరిగింది .ఇప్పుడికి 38లక్షల మంది సభ్యత్వంతో ఏపీ లో బీజేపీ పార్టీ ఉంది .బీజేపీ ప్రస్థానం ఇద్దరితో పార్లమెంట్ లోకి అడుగుపెట్టి ప్రతి ఐదు సంవత్సరాలకి అంచెలంచెలుగా ఎదిగింది .ప్రతిపక్ష కూటమిలు బీజేపీ పై అసత్య ప్రచారాలు ప్రజలకి తెలియచేసిన వాటిని తిప్పి కొట్టారు .

బీజేపీ పార్టీ రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న పార్టీ ఈ స్థాయి కి వచ్చానంటే దానికి కారణం అంబేద్కర్ తీసుకొచ్చిన రిజర్వేషన్స్ అని ప్రధాని మోదీ అన్నారు .కుల మతాలకి తావు లేకుండా సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో దేశ సమగ్రభివృద్ధి కొరకు బీజేపీ పని చేస్తుంది .ప్రతి పేద వారికీ సంక్షేమ పథకాలు అందించటం వల్లే మూడో పర్యాయం కూడా ప్రజలు బీజేపీ ని ఆశీర్వాదించారు .ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజా హిత పాలన అందించేవిధంగా అంకితమై పని చేస్తుంది .యువతని ప్రోత్సహించేందుకు యువ మోర్చా ద్వారా యువతకి అనేక పథకాలు ప్రధాని మోదీ ఇవ్వగలుగుతున్నారు .స్టార్ట్ అప్, స్టాండ్ అప్ యువతకి అనూహ్యమైన అవకాశాలు కేంద్రం కలిపిస్తుంది . యువమోర్చా కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలన్నారు.

సభకు అధ్యక్షత వహించిన బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదులో బిజెవైఎం ఒక రికార్డు సాధించే విధంగా పనిచేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో ప్రకటించారు. బిజెవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నవనీత్ కృష్ణారెడ్డి , MVSK రాజు బీజేపి NTR జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ , బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓరుగంటి మాధవరావు, బేతిరెడ్డి ఆదిత్య, మాదాస్ లోకేష్ , BJYM కార్యదర్శులు శివ రాయల్ ,జీవన్, అజేష్ యాదవ్, మనోజ్ ,చిన్నారి, జోనల్ ఇన్చార్జులు అశోక్ రెడ్డి, కోట్ల సూర్య తేజ,అనపర్తి వెంకటేష్ రాష్ట్ర కోశాధికారి బొడ్డు కృష్ణ చైతన్య జిల్లా బిజెవైఎం అధ్యక్షుడు నరసరాజు తదితరులు పాల్గొన్నారు. తొలుత వర్క్ షాప్ లో బిజెపి హెడ్ క్వార్టర్ ఇంఛార్జి శివామకుటుం సభ్యత్వ నమోదు పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంటా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని గజమాలతో యువమార్చా నేతలు సత్కరించారు.

LEAVE A RESPONSE