– కాంట్రాక్ట్‌లను లాక్కుని, జగ్గయ్యపేట, రాజమండ్రిలో ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా పెట్టారు .
– హైదరాబాద్ ఐటీసీ సాక్షిగా ఏం జరుగుతోంది?
– బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య అక్రమ వసూళ్ళపై విచారణ జరపాలి
– జగ్గయ్యపేట, రాజమండ్రిలో ప్రీ ప్రోసెసింగ్ కంపెనీలను తన బినామీల ద్వారా ఏర్పాటు చేసుకున్నారు
– ఇందులో ఒకదానికి అనుమతి వచ్చింది
– ఫార్మా వేస్ట్‌ను ప్రీ ప్రాసెసింగ్ ద్వారా సిమెంట్ కంపెనీలకు సరఫరా చేసేందుకు తన బినామీలతో వ్యవహారం
– వైయస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్ సంచలన ఆరోపణలు
తాడేపల్లి: పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య పెద్ద ఎత్తున పరిశ్రమల నుంచి అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారని వైయస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్ ఆరోపించారు. బోండా ఉమాను అడ్డం పెట్టుకుని టీడీపీ పెద్దలే అసెంబ్లీలో దీనిపై ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించేలా చేశారని అన్నారు.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వ్యవహారం మీద అసెంబ్లీ సాక్షిగా . బోండా ఉమ ఒక వ్యూహం ప్రకారమే కాలుష్య నియంత్రణ మండలి అవినీతి వ్యవహారంపై ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు లేవు. అయినా కూడా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించడం వెనుక టీడీపీలోని పెద్దలు ఉన్నారు.. బోండా ఉమాతో ఎవరు పవన్ కళ్యాణ్‌ను ఘాటుగా ప్రశ్నించడానికి ప్రేరేపించారు? దీని వెనుక ఎవరు ఉన్నారు? అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.
సంబంధం లేని కాలుష్య నియంత్రణ మండలి మీద బోండా ఉమ అంత హటాత్తుగా ఎందుకు ప్రశ్నించారనే దానివెనుక టీడీపీ పెద్దల దిశానిర్ధేశం ఉందా? ఇది నిజం కాకపోతే అంత థైర్యంగా ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించే శాఖపై సూటిగా ఎలా ప్రశ్నలు కురిపించారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి.
కాలుష్య నియంత్రణ మండలికి నియమించిన చైర్మన్ వల్లే పొల్యూషన్ బోర్డ్‌లో తీవ్ర అవినీతి జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. చాలా సంస్థలను బెదిరిస్తూ పెద్ద ఎత్తున సదరు అధికారి వసూళ్ళకు పాల్పడుతున్నారనే సమాచారం.
వసూలు చేసిన సొమ్ము ఎవరికి చేరింది? హైదరాబాద్ ఐటీసీ సాక్షిగా ఏం జరుగుతోంది? ఎవరెవరు ఈ సొమ్మును వాటాలు వేసుకుని పంచుకుటున్నారనే దానిపై కూటమి పార్టీల్లోనే చాలా మంది మాట్లాడుతున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో కీలకస్థానంలో ఉన్న కృష్ణయ్య హైదరాబాద్‌లో ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ఆస్తులు సంపాధించుకున్నారనే వార్త కూడా బయటకు వస్తోంది.
అంతే కాకుండా ఆయన చాలా కంపెనీలను బెదిరించి, వారి వద్ద ఉన్న కాంట్రాక్ట్‌లను లాక్కుని, జగ్గయ్యపేట, రాజమండ్రిలో ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా పెట్టారనే వార్త కూడా బయటకు వస్తోంది. మొత్తంగా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ, మంత్రి వపన్ కళ్యాణ్‌కు మధ్య జరిగిన ప్రశ్నలతో ఈ మొత్తం అవినీతి వ్యవహారం బయటకు పొక్కింది.
కాలుష్య నియంత్రణ మండలి పరిధిలో ప్రతి సంస్థను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారు. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య వల్లే అవినీతి జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్యేలే మండిపడుతున్నారు. పర్యావరణ పరిరక్షణ పై పదేపదే నీతిమాటలు చెబుతున్న పవన్ కళ్యాణ్ ఆ ముసుగులో జరుగుతున్న అవినీతిని ఎలా ఉపేక్షిస్తున్నారు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ ఒక్క పవన్ కల్యాణ్ మాటలు తప్ప ఎవరి మాట వినరు అని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపించారు.
చైర్మన్ కృష్ణయ్య పెద్ద కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు, ఫార్మా, సిమెంట్ కంపెనీల నుంచి భారీగా వసూళ్ళకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరులో కృష్ణయ్య ఇంటికి సమీపంలో ఉండే వ్యక్తిని తన బినామీగా ఆయన పెట్టుకుని, ఈ వసూళ్ళకు పాల్పడుతున్నట్లు టీడీపీ, జనసేన పార్టీ నాయకులే బయట మాట్లాడుతున్నారు.
కృష్ణయ్య చైర్మన్ అయిన తరువాత తునిలో డక్కన్ కెమికల్స్, పరవాడ లోరస్ ల్యాబ్, కడప ఇండియా సిమెంట్స్, జువారీ సిమెంట్స్ లతో పాటు పెద్దపెద్ద కంపెనీలను టార్గెట్ చేసి, తనిఖీల పేరుతో భారీగా వసూళ్ళకు పాల్పడ్డారు. ఆయన అవినీతిని తట్టుకోలేక పెద్ద పెద్ద కంపెనీలు పారిపోతున్నాయి. కృష్ణయ్యతో సెటిల్మెంట్కు రాకపోతే, టాస్క్‌ఫోర్స్‌తో తనిఖీలు చేయించి, లోపాలను చూపి ఆ కంపెనీలను మూసేయిస్తున్నారు.
జగ్గయ్యపేట, రాజమండ్రిలో ప్రీ ప్రోసెసింగ్ కంపెనీలను తన బినామీల ద్వారా ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఒకదానికి అనుమతి వచ్చింది. ఫార్మా వేస్ట్‌ను ప్రీ ప్రాసెసింగ్ ద్వారా సిమెంట్ కంపెనీలకు సరఫరా చేసేందుకు తన బినామీలతో వ్యవహారం నడిపిస్తున్నారు. రోజుకు రూ.30 లక్షల ఆదాయం ఆర్జించాలనే లక్ష్యంతో కృష్ణయ్య పనిచేస్తున్నారు.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో పదోన్నతులు, బదిల పేరుతో పెద్ద ఎత్తున కృష్ణయ్య కోట్ల రూపాయలు దండుకున్నారు. ఈ సొమ్మును తన బినామీ ద్వారా వసూలు చేయిస్తున్నాడు. ఏపీలో చిన్నచిన్న ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లకు ఫార్మా వేస్ట్‌ను ఇవ్వనివ్వకుండా, వారికి ఏదో ఒక సాకు చూపి, వారికి అనుమతులు ఇవ్వనివ్వకుండా, తెలంగాణలోని ప్రాసెసింగ్ యూనిట్లతో ఒప్పందాలు చేసుకున్నారు.
అందుకు గానూ ఒక్కో ప్రాసెసింగ్ యూనిట్ నుంచి రూ.50 లక్షల చొప్పున వసూలు చేసుకున్నారు. దీనివల్ల ఏపీలోని చిన్నచిన్న ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు దెబ్బతింటున్నాయి. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో జరుగుతున్న అవకతవకలను టీడీపీ ఎమ్మెల్యే ప్రస్తావిస్తే, దానిపై విచారణ జరిపించేందుకు సీఎం చంద్రబాబు ఎందుకు సిద్దంగా లేరు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వం స్పందించాలి, విచారణ చేయాలి.