Suryaa.co.in

Education Features

మన దైనందిక జీవితంలో గణితం గొప్పదనం

నేను యుఎస్‌ (అమెరికా)కి మా అబ్బాయి దగ్గరకి వెళ్లాను. నా కొడుకు తో కలసి ఒక మంచి రెస్టారెంట్‌లో పిజ్జా ని ఆస్వాదించ డానికి వెళ్ళాను.
9-అంగుళాల పిజ్జా ని ఆర్డర్ చేశాను. కాసేపటి తర్వాత, వెయిటర్ రెండు 5-అంగుళాల పిజ్జాలు తెచ్చి, 9-అంగుళాల పిజ్జా అందుబాటులో లేదని దానికి బదులుగా మీకు రెండు 5-అంగుళాల పిజ్జాలు ఇస్తున్నామని చెప్పాడు, మరియు దీనివల్ల మీరు 1 అంగుళం ఉచితంగా పొందుతున్నారని చెప్పాడు…
దానికి కొడుకు సంతోషంగా నాకు ఏదో వివరించబోయాడు..దానికి నేను నా కొడుకుని వారించి..
సీరియస్ గా రెస్టారెంట్ ఓనర్‌ని పిలవమని వెయిటర్‌కి మర్యాదపూర్వకంగానే చెప్పాను.
ఓనర్ వచ్చి ఏదో సర్దిచెప్పబోయాడు.. నేను ఓనర్ని ఆగమని చెప్పి ఒక వృత్తం యొక్క వైశాల్యాన్ని లెక్కించడానికి గణిత సూత్రాన్ని వివరించాను..

వృత్తం వైశాల్యం = π r² ఇక్కడ π = 3.1415926,
r అనేది వృత్తం యొక్క వ్యాసార్థం . . .
కాబట్టి, 9-అంగుళాల పిజ్జా వైశాల్యం = 63.62 చదరపు అంగుళాలు,
అయితే 5-అంగుళాల పిజ్జా వైశాల్యం 19.63 చదరపు అంగుళాలు
రెండు 5-అంగుళాల పిజ్జల వైశాల్యం 2 x 19.63 = 39.26 చదరపు అంగుళాలు వస్తుంది.
ఒక అంగుళం ఫ్రీగా ఇస్తున్నానని చెప్పి చెవ్వులో పువ్వు పెడుతున్నావు.
మీరు నాకు మూడు పిజ్జాలు ఇచ్చినా, ఇంకా నేనే నష్టపోతాను వివరించి చెప్పాను.
దానికి కొడుకుతో పాటు చుట్టూవున్న అమెరికన్లు కూడా విస్తుపోయారు..రెస్టారెంట్ యజమాని నోరు మెదపలేదు. . .
చివరకు నమస్కారం చేసి, sorry చెప్పి 4 పిజ్జాలు ఇచ్చి డబ్బులు కూడా వద్దన్నాడు..
నేను డబ్బులు మాత్రం ఇచ్చేసి, నిజాయితీగా ఉండమని సెలవిచ్చి వచ్చేసాను..
దయచేసి పిల్లలకు గణితాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సలహా ఇవ్వండి.

– ఎంఆర్‌ఎస్ శర్మ

LEAVE A RESPONSE