రోడ్డు పక్కన చీర అడ్డుపెట్టుకుని స్నానం చేసిన మాయావతి బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు.
పబ్లిక్ రోడ్డులో సైకిల్ రిక్షామీద ఒంటి కాలిపై నిలబడి గంటలపాటు ప్రసంగాలు చేసిన మాయావతి ఎవరికీ తెలియకపోవచ్చు.
కార్యకర్తలతో కలిసి నేలమీద పడుకున్న మాయావతి ఎవరికీ తెలియకపోవచ్చు.
ఇంట్లో వాళ్లు తిట్టినా, ఇరుగుపొరుగు అవమానించినా లెక్కచేయక బహుజన వాదం కోసం ఆమె పడ్డ కఠోర శ్రమ ఎవరికీ తెలియకపోవచ్చు.
సెక్సువల్ అఫైర్స్ అంటగడుతూ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ.. ఒంటి మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టే మాటలు ఎన్ని భరించారో ఎవరికీ తెలియకపోవచ్చు.
పోస్ట్ మ్యాన్ కూతురు నుంచి సీఎం దాక ఆమె ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లు, ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ఆమె పడ్డ అవమానాలు, చీదరింపులు ఎవరికీ తెలియకపోవచ్చు.
ఈరోజు కుర్చీలో కూర్చున్న మాయావతే చాలా మందికి తెలుసు.
ఆమె సీఎం అయి ఏం చేశారని కొందరి ప్రశ్న..
బహుశా.. ఒకసారి గ్రేటర్ నోయిడా వెళ్లమని నా సలహా. దేశ రాజధాని పేరు ఢిల్లీ అయినా.. అసలు రాజధాని ఏదో, అలా ఎవరు మార్చారో రోడ్డు మీద ఉండే సైన్‌బోర్డులు చెప్తాయి.
మాయావతి సీఎం కాకముందు అయిన తర్వాత.. యూపీలోని సామాజిక, ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వ రిపోర్టులు చూడండి, బెహెన్‌జీ ఏం చేశారో తెలుస్తుంది.
తను మాట్లాడే మాట పక్కింటోడు కూడా వినడు. బెహన్‌జీ ఎందుకు మాట్లాడట్లేదు, బీఎస్పీ లేనేలేదు అంటారు. అరె బాబు.. బీఎస్పీ అనే జాతీయ పార్టీ ఉంది కాబట్టే.. దళితుల మీద అన్ని రాజకీయ పార్టీలు సానుభూతి ఒలకబోస్తున్నాయి. డైరెక్ట్‌గా ఏదైనా అనాలంటే భయపడుతున్నాయి. లేదంటే ముస్లింలను దేశద్రోహులు, పాకిస్తానీలను అన్నంత సులభంగా.. మీది ఈ దేశం కాదు దొబ్బెయ్ అనేవాళ్లు. మీకు ఈరోజు ఆ గొంతు పని చేస్తుందంటే దానికి కారణం బీఎస్పీ.. లేదంటే కమ్యూనిస్టుల కంటే ఘోరంగా అణచివేసేవాళ్లు.
అవును బై.. వాళ్లు కిందే కూర్చున్నా, వెన్ను నిటారుగా ఉంచి కూర్చున్నారు.
KCR, జగన్, చంద్రబాబు, సోనియా, మోదీ, అడ్వాణీ..
వీళ్ల ముందు చేతులు కట్టుకొని వంగి వంగి దండాలు పెట్టే బానిసలు కాదు వాళ్లు.
ఆ హాల్ కెపాసిటీ అలాంటిది.
వాళ్ల సుప్రీం లీడర్ చేస్తున్న సూచనలు వింటున్నారు.
రేపు ఏం చేయాలో తెలుసుకుంటున్నారు.
బాబాసాహెబ్ ప్రసంగిస్తుంటే వేలాదిమంది కిందే కూర్చునేవారు.
కాన్షీరాం క్యాంపు పెడితే పార్టీ నేతలు రెండు మూడు రోజులు కిందే కూర్చునేవారు.
ఈరోజు ఎక్కడ కూర్చున్నామని కాదు, రేపు ఎక్కడ కూర్చుందామనే ఆలోచన ఉండేది.
సాధించారు కూడా.
బెహెన్‌జీ కూడా కిందే కూర్చొని వినేవారు.
ఇలాంటి వారి వల్లే BSP జాతీయ పార్టీ అయింది.
సర్పంచ్‌కి పోటీ చేసే దమ్ము లేని చవటలు,
కనీసం ఇంట్లోవాళ్ల ఓట్లు కూడా వేసుకోలేని దద్దమ్మలు
మస్త్ అంటరు. మాయావతి ఇవన్నీ పట్టించుకోరు, పట్టించుకుంటే ఆ స్థానంలో ఉండేవారు కాదు.