దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో రెండో రోజైన సోమవారం తెలంగాణ బృందం సత్తా చాటింది. సోమవారం ఒకే రోజు రెండు సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ బీమా సంస్థ స్విస్రేతో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ… తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషోతో రెండో ఒప్పందాన్ని కుదర్చుకుంది.
తాజా ఒప్పందం ప్రకారం మీషో సేవలు ఇకపై తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరించనున్నాయి. ఈ మేరకు త్వరలోనే మీషో సంస్థ హైదరాబాద్లో తన కార్యాలయాన్ని ప్రారంభించనుంది. ఇప్పటిదాకా ఈ సంస్థ సేవలు నగరాలకు మాత్రమే పరిమితమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా ఈ సంస్థ సేవలు అందనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో మీషో సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది.
Meesho will be utilizing the Tier-II IT hubs across Telangana along with utilizing the various platforms such as @TSATnetwork and @taskts. Minister @KTRTRS welcomed @Meesho_Official and its Founder & CEO Mr. @viditaatrey to Telangana.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 23, 2022