Suryaa.co.in

Andhra Pradesh

బాబుతో ముస్లిం సంఘాల భేటీ

బాబు బక్రీద్ శుభాకాంక్షలు

బక్రీద్ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని పలువురు ముస్లిం సంఘాల నేతలు సోమవారం ఉండవల్లి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. సీఎంను కలిసిన వారిలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఫీ, టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫరూక్ షుబ్లీ, ఇతర ముస్లిం సంఘాల నేతలు ఉన్నారు.

LEAVE A RESPONSE