డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి : దర్శి మండల కేంద్రం ఎంపీడీఓ ఆఫీస్ లోని మీటింగ్ హాల్ లో శనివారం 2025 మెగా డీఎస్సీ ద్వారా నూతన టీచర్ ఉద్యోగాలు పొందిన నియోజకవర్గం లోని 59 మంది నూతన టీచర్స్ కి అభినందనలు తెలిపే కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ దర్శి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తొలుత కొత్త టీచర్లను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్బంగా లక్ష్మి మాట్లాడారు. నియోజకవర్గం నుంచి 59 మందికి ఉపాధ్యాయ నియామకాలు ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు. ఈ మెగా డీఎస్సీ ఉత్సవం సందర్భంగా ఎంపికైన 15,941 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేయడం ఆనందదాయకం. 1994 నుంచి 2025 వరకు 14 డీఎస్సీల ద్వారా 1,96,619 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత చంద్రబాబు దేనని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు నారపుశెట్టి పాపారావు, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, నియోజకవర్గం లోని ఎంఈవో, తదితరులు ఉన్నారు.