– తెలంగాణలోని సంస్కృత అకాడమీ వేదికపై ఆర్. డి. విల్సన్
హైదరాబాద్ : హైదరాబాద్ సంస్కృత అకాడమీ, భాషా సమితి (న్యూఢిల్లీ) ఆధ్వర్యంలో “యూనిఫామ్ సైంటిఫిక్, టెక్నికల్ టెర్మినాలజి ఫర్ ఇండియన్ లాంగ్వేజస్ ” అంశంలో రెండు రోజుల వర్క్ షాప్ హైదరాబాద్ లో శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ (శరత్ చంద్ర) పాల్గొని ముఖ్య ఉపన్యాసం ఇచ్చారు. వేదిక పై అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ మధుసూదన్, సంపూర్ణానంద యూనివర్సిటీ (బెనారస్) డీన్ విజయ్ కుమార్ పాండే, మరో ముఖ్య అతిథి ప్రొఫెసర్ పాతూరి నాగరాజు(న్యూఢిల్లీ) తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ కి మెమెంటో ఇచ్చి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా విల్సన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సంస్కృత అకాడమీని అభివృద్ధి చేస్తామన్నారు. పండితుల పుస్తకాలు అకాడమీ పునర్ ముద్రిస్తుందన్నారు. అమృతం కంటే సంస్కృతం మధురమైంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. “అమృతం మధురం సమ్యక్ సంస్కృతం హి తతోదకం “ఇతి వక్తుం తత్ర కి మపే నాస్తి అతిశయోక్తి “అన్నారు. అదే విధం గా ధర్మం గురించి వివరించారు.