Suryaa.co.in

Andhra Pradesh

వచ్చే వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్

-కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
-మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జ‌రిగిన మంత్రి మండ‌లి స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌పై చ‌ర్చించి ఆమోదించారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. అమ‌రావ‌తిలోని సచివాలయం మొదటి బ్లాక్‌లో జ‌రిగిన మంత్రిమండ‌లి స‌మావేశంలో పలు కీలక అంశాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారని అన్నారు.

రాష్ట్రంలోని నిరుద్యోగులకు జ‌గ‌న్‌ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పిందని, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని, 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. అదే విధంగా స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్ర‌మోష‌న్ బోర్డు స‌మావేశంలో ఆమోదించిన తీర్మానాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిందని, ఇంధన రంగంలో రూ. 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.

పలు కీలక అంశాలకు ఆమోదం

– మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌
– 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్‌ ఆమోదం
– వైయ‌స్సార్‌ చేయూత 4వ విడతకు ఆమోదం, ఫిబ్రవరిలో వైయ‌స్సార్‌ చేయూత నిధులు విడుదల
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం
– ఎస్‌ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్‌ సిగ్నల్‌
– ఇంధన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రాతిపాదనలకు ఆమోదం
– అందులో భాగంగా -నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్‌ పవర్‌ ప్రాజెక్టులకు ఆమోదం. శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
– ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి ఆమోదం
– ఎస్‌ఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్‌ ఆమోదం
– యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంపు
– అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం
– ఆర్జేయూకేటీకి రిజిస్ట్రార్‌ పోస్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

LEAVE A RESPONSE