Suryaa.co.in

Telangana

న్యూక్లియర్ పవర్ రంగంలోకి ఎంఈఐఎల్

-ఎన్ పీ సి ఐ ఎల్ నుంచి 13 వేల కోట్ల ఈ పీ సి కాంట్రాక్ట్ దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్
-బుధవారం బిడ్ తెరిచిన ఎన్ పీ సి ఐ ఎల్
-తక్కువ కోట్ చేసి మొదటి స్థానంలో నిలిచిన ఎం ఈ ఐ ఎల్
-క్యూ సి బి ఎస్ పద్దతిలో ఎన్ పీ సి ఐ ఎల్ లో ఇదే పెద్ద టెండర్

హైదరాబాద్, జూన్ 26: కర్ణాటక రాష్ట్రంలోని కైగా వద్ద 14 వందల మెగా వాట్ ఎలక్ట్రికల్ (ఎం డబ్ల్యూ ఈ )అణు విద్యుత్ కేంద్ర నిర్మాణానికి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (ఎన్ పీ సి ఐ ఎల్ ) పిలిచిన టెండర్లలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) అగ్రస్థానంలో నిలిచింది.

ఈ పీ సి పద్దతిలో నిర్మించె ఈ అణువిద్యుత్ కేంద్ర నిర్మాణ భారీ కాంట్రాక్టు ను మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) చేజిక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అణు ఇంధనశాఖ పరిధిలోని ఎన్ పీ సి ఐ ఎల్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈ పీ సి ) పద్దతిలో ఈ రియాక్టర్ల నిర్మాణానికి గత ఏడాది మే నెలలో టెండర్లు పిలిచింది. అదే ఏడాది అక్టోబర్ నాలుగున టెండర్ల దాఖలుకు తుది గడువుగా నిర్ణయించారు.

ఆ తరువాత రోజు అక్టోబర్ ఐదున సాంకేతిక బిడ్లను తెరిచారు. ఈ ఏడాది జూన్ 26న (బుధవారం) ప్రైస్ బిడ్లను తెరిచారు. ఈ బిడ్ లో తక్కువ ధరను కోట్ చేసి ఎం ఈ ఐ ఎల్ తోలి స్తానం లో నిలిచినట్లు సంస్థ డైరెక్టర్ సి హెచ్ సుబ్బయ్య తెలిపారు. ఈ టెండర్ ప్రక్రియలో ఎల్ అండ్ టి , బి హెచ్ ఈ ఎల్ కూడా పాల్గొన్నాయి. ఈ రెండు, సంస్థలు ఎక్కువ ధరను కోట్ చేసి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఎం ఈ ఐ ఎల్ రూ 12,799. 92 కోట్ల ధరను కోట్ చేసి మొదటి స్థానంలో నిలిచింది.

టెండర్ల విధానంలో ఎన్ పీ సి ఐ ఎల్ క్వాలిటీ కం కాస్ట్ బేస్డ్ (క్యూ సి బి ఎస్ ) విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ సంస్థ పిలిచిన టెండర్లలో ఇదే పెద్దది. టెండర్ ఖరారు కు ముందు ఎన్ పీ సి ఐ ఎల్ నాణ్యతా ప్రమాణాలు, ఖర్చు నియంత్రణ ఇతర అంశాలపై అంచనాలు వేసింది. 13 వేల కోట్ల విలువ కలిగిన కాంట్రాక్టు ను ఎం ఈ ఐ ఎల్ తొలిసారిగా దక్కించుకుని అణు ఇంధన రంగంలోకి ప్రవేశించిందని సుబ్బయ్య తెలిపారు. ఇది తమ సంస్థ ప్రయాణంలో ఒక మైలు రాయి అని ఆయన తెలిపారు.

LEAVE A RESPONSE