“దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా” అని అనలేదని నీ భార్య, కొడుకుపై ఒట్టేసి చెప్పగలవా బాబూ..?
– నీవు అన్నావని నేను, నా భార్యాపిల్లలపై ఒట్టేసి చెబుతా..
– నా సవాల్ ను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా..?
– యర్రగొండపాలెంలో వీధిరౌడీలా బాబు వీరంగం
– నీ కొడుకు “దళితులు ఏం పీకుతారు” అని అన్నాడా.. లేదా..?
– క్షమాపణలు చెప్పమంటే దళితులపైనే దాడులా..?
– దగ్గరుండి అడ్డగాడిదలా దళిత మంత్రి సురేష్ పై రాళ్లేయిస్తావా..?
– వళ్లు దగ్గర పెట్టుకో చంద్రబాబూ…లేకుంటే మా దళితులే తోలు తీస్తారు
– దళిత మంత్రికి మూలాలు లేవంటావా..? చంద్రబాబు మదమెక్కి మాట్లాడుతున్నాడు..
– దళితులను భయపెట్టాలని చూస్తే నిన్ను, నీ పార్టీని భూస్థాపితం చేస్తాం
-ఃమంత్రి మేరుగు నాగార్జున
యర్రగొండపాలెంలో వీధిరౌడీలా బాబు వీరంగంః
– నిన్న యర్రగొండపాలెంలో చంద్రబాబునాయుడు వీరంగం వేశాడు
– చంద్రబాబు ఎంత వీధి రౌడీనో, ఎలా బరితెగించి రాజకీయాలు చేస్తున్నాడో రాష్ట్ర ప్రజలందరూ చూశారు
– దళితుల మీద ఎంత కర్కశంగా ఆయన దాడులు చేయిస్తున్నాడో చూస్తున్నాం
– చంద్రబాబును చూసి వీధి రౌడీ అనుకోవాలా.. దళితులమీద, పేదల మీద అఘాయిత్యాలకు పాల్పడే దుర్మార్గుడు అనుకోవాలా..?
– రాష్ట్రంలో ప్రజా రంజక పరిపాలన జరుగుతుంటే.. మీ కూసాలు కదిలిపోతుంటే దిక్కులేని స్థితిలో తండ్రీ కొడుకులు రోడ్డున పడ్డారు.. నోటికి అడ్డూఅదుపూ లేకుండా
బరితెగించి మాట్లాడుతున్నారు..
– మా సోదరుడు, రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్, మా పార్టీ శ్రేణులపై దాడికి ఉసిగొల్పింది నీవు కాదా చంద్రబాబూ.. అని ప్రశ్నిస్తున్నా
– చంద్రబాబు ఒక బరితెగించిన రాక్షసుడు.. దళిత వ్యతిరేకి..దళితులపై దాడి చేయించడం చంద్రబాబుకు పరిపాటి
– దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నది చంద్రబాబు అవునా.. కాదా..?
– నీ కొడుకు లోకేశ్ .. “దళితులు ఏం పీకుతారు” అని అనలేదా..?
– నీకు ఎలాగూ దేవుడి మీద నమ్మకం లేదు.. నీవు అనలేదని నీ భార్యా కొడుకు మీద ఒట్టేసి చెప్పు చంద్రబాబూ..
– నువ్వు అన్నావని నా భార్యా పిలల్లపై నేను ఒట్టేసి చెప్తా. నా సవాల్ ను స్వీకరించే దమ్ముందా బాబూ నీకు..
దగ్గరుండి మా దళిత మంత్రిపై దాడి చేయిస్తావా..?:
– మా దళిత కులాలను తేలిగ్గా చూడటం, హేళన చేయడం.. మా మీద దాడులు చేయించడం చంద్రబాబుకు బాగా అలవాటు
– మొన్నటికి మొన్న అమలాపురంలో మా దళిత సోదరుడు ఇళ్ళపై దాడి చేయించావు.. మరో బీసీ సోదరుడి ఇంటిపై దాడి చేయించావు
– ఈ రోజు దగ్గరుండి అడ్డగాడిదలా నా సోదరుడు, సహచర దళిత మంత్రి మీద రాళ్లేయిస్తావా..? నీకు ఎంత అహంకారం చంద్రబాబూ..?
– నీ డిఎన్ఏలోనే మా దళితుల జీవితాలను ఛిద్రం చేయాలని, మా రక్తం తాగాలని, మమ్మల్ని అడ్డుపెట్టుకుని స్వార్థ రాజకీయాలు చేయాలని ఉందనుకుంటాను.
– దళితులపై అవాకులు, చెవాకులు మాట్లాడితే.. తస్మాత్ జాగ్రత్త… వళ్లు దగ్గర పెట్టుకో చంద్రబాబూ…తోలు తీస్తాం.
మాకు మూలాలు లేవంటావా?:
– మా దళిత మంత్రి సురేష్ ను పట్టుకుని.. మూలాలు లేని ఆదిమూలం అంటావా..? అంత మదం ఎక్కి కొట్టుకుంటున్నావా..?
– మా కులానికి మూలాలు లేవా..? నువ్వు ఏ విధంగా రాజకీయాలు చేస్తావో చూస్తాం
– ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున్న మేస్తుందా అన్నట్లు నీ కొడుకు దళితులు ఏం పీకలేరు.. అని అంటున్నారు
– దళితులంటే నీకెందుకు చిన్నచూపు, హేళన. మా మీదనే దాడులు చేయిస్తావా..?
– 14 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న నువ్వు మా కులాలపై దాడులు చేయిస్తున్నావు
– మా కులాలను భయపెట్టాలని చూస్తే నిన్ను భూస్థాపితం చేస్తాం
– 2019లో చంద్రబాబు 23 స్థానాలకు దిగజారిపోయి, రాజకీయంగా పతనమయ్యాడు.. ఈ సారి భూస్థాపితం అవుతాడు
– మా సహనాన్ని పరీక్షించవద్దు.. ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అన్నింటా అండగా ఉంది. అన్నింటికీ మించి జగనన్న గుండెల్లో దళితులకు ప్రత్యేక స్థానం ఉంది.
అమరావతిలో మీ వాళ్లే బతకాలా..?:
– అంబేద్కర్ ఆలోచన విధానంతో, జగ్జీవనరావు కాన్సెప్ట్‌తో మేం బతుకుతున్నాం
– పొదల్లో, ముళ్లకంచెల్లో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తివి నువ్వు
– నీ హయాంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేకపోయావో సమాధానం చెప్పు
– ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు ఆ మహానుభావుడు 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున పెడుతున్నారు
– నీవేమో అమరావతి రాజధాని ప్రాంతంలో దళితులు ఉండొద్దు, ఉంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అంటే.. మా నాయకుడు వారికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు.
– అమరావతిలో మీవాళ్లు బతకొచ్చు కానీ.. మేం బతకకూడదా..?
– దళితుల్ని వెలివేసి.. శవాల మీద పేలాలు ఏరుకునేలా రాజకీయాలు చేయాలి అనుకుంటున్నాడు చంద్రబాబు
టైమ్స్ నౌ సర్వేతో చంద్రబాబుకు వణుకు:
– జగన్ గారు రాష్ట్ర రూపురేఖల్నే సమూలంగా మారుస్తూ, సంస్కరణల బాట పట్టిస్తూ, రూట్ లెవల్ నుంచి సుపరిపాలన అందచేస్తూ అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తున్నాడు.
– దాంతో జనం జగన్ గారికి నీరాజనాలు పలుకుతున్నారు. అందుకే టైమ్స్ నౌ సర్వేలో 25కు 25 పార్లమెంటు స్థానాలు వస్తున్నాయని చెప్పేసరికి చంద్రబాబుకు వణుకుపుట్టింది
– అందుకే భయపడిపోయి, పిచ్చెక్కినట్లు చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
– దళితులు ఉండకూడదు అన్న నిన్ను రాజకీయాల నుంచి వెలివేయాలి మా దళిత సమాజం అంతా భావిస్తుంది.
– మా దేవుడ్ని అవమానపరిచావ్.. మా కులాలను అవమానపరిచావ్.. అందుకే నీకు రాజకీయ చరమగీతం పాడటానికి మా దళితులంతా సిద్ధంగా ఉన్నారు.
బహిరంగ క్షమాపణలు చెప్పాలిః
– దళిత జాతిని, అంబేద్కర్‌ను అవమాన పరిచిన చంద్రబాబు, నీతిలేకుండా మాట్లాడుతున్న లోకేశ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి
– అప్పుడే మీరు రాష్ట్రంలో తిరగగలుగుతారు… లేకుంటే ఎక్కడికక్కడ మా దళితులు మిమ్మల్ని నిలదీస్తారు.
– తస్మాత్ జాగ్రత్త చంద్రబాబూ.. జగన్మోహన్ రెడ్డి గారి ముందు నీ ఉడత ఊపులు చెల్లవు
– రాళ్లేయిస్తే అయిపోలేదు.. ఊళ్లలోకి వస్తే దీనిపై ప్రాయశ్చిత్తం అనుభవిస్తావు
– సమాజంలో వెనుకబడి ఉన్నాం కాబట్టి.. మేమేమీ చేయలేమని చంద్రబాబునాయుడు మదం ఎక్కి మాట్లాడుతూ, మాపై దాడులు చేయిస్తున్నాడు
– వాళ్ల లాగా రాళ్ళ దాడులు చేసి, రక్తం కళ్ళ చూసే వాళ్లం మేము కాదు.. మేం నమ్మిన సిద్ధాంతం కోసం వెళ్లేవాళ్లం
– అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు ద్వారా చంద్రబాబు రథచక్రాలు ఊడగొడతాం.