-5000వేల శక్తి కేంద్రాల్లొ బిజెపి నేతల పర్యటనలు
-బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు
విజయవాడ: రాష్ట్రప్రభుత్వం పై ఛార్జిషీట్ల ఉధ్యమానికి గ్రామస్ధాయిలో అభియోగాల నమోదుకు బిజెపి శ్రేణులు కధం తొక్కుతున్నాయి. ప్రాంతాల వారీగా సమస్యలను గుర్తించడంతో పాటు ఆధారాల సేకరణలో బిజెపి నాయకత్వం తలమునకలై ఉంది. ఇప్పటికే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్వీయ పర్యవేక్షణలో వేగం పెంచారు అందుకు అనుగుణమైన మైక్రోలెవెల్ అబ్జర్వేషన్ పెంచారు.
ఇప్పటికే వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి ఉధ్యమాన్ని షురూ చేయడంతో బిజెపి ఆయా జిల్లాల నాయకత్వాలు అసెంభ్లీ స్ధాయి నాయకత్వానికి పని విభజన చేయడంతో గ్రామాల వారిగా అభియోగాల స్వీకరణ కు ప్రజల వద్దకు నేరుగా వెళుతున్నారు. శక్తి కేంద్రాలు అంటే నాలుగు పోలింగ్ కేంద్రాలకు ఒక శక్తి కేంద్రంగా బిజెపి పార్టీ కార్యక్రమం రూపొందించుకుంది అందుకు అనుగుణంగా 5000 శక్తి కేంద్రాల్లో బిజెపి నేతలు పర్యటనలు కొనసాగాయి.
విజయవాడ వన్ టౌన్ లో బిజెపి శ్రేణులు కాలనీల్లో పర్యటించి అభియోగాలు నమెదు చేసారు ఈ సందర్భంగా కార్పోరేషన్ సమస్యల పై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. శానిటేషన్ కు సంబందించిన ఫిర్యాదులు కూడా బిజెపి నాయకత్వానికి వచ్చాయి. ఉత్తరాంధ్ర, రాయల సీమ దక్షిణ కోస్తా ప్రాంతంలో కూడా అభియెగాలను స్వీకరించారు.అరసవల్లిలో కేంద్రం నిధులను దారిమళ్లించిన సంఘనలు ఉన్నాయని బిజెపి నేతలు ప్రకటించారు. అదేవిధంగా నెల్లిమర్లలో అధికార పార్టీ వైసీపి నేతలు అవినీతికి పాల్పడిన సంఘటనలు బిజెపి నేతలకు సమాచారం అందించి. భీమవరం సమీపంలోని పాలకోడేరులో ఎస్సీ కాలనీల్లో పేరుకుపోయిన సమస్యల పై బిజెపి నేతలు అభియోగాలు నమోదు చేశారు.
ఉభయగోదావరి జిల్లాల్లో వ్యవసాయశాఖ, సివిల్ సప్లైయ్ అధికారుల వల్ల సమస్యలు ఉన్నాయని రైతాంగం బిజెపి నేతలు ద్రుష్టికి తీసుకుని వచ్చాయి. రాయల సీమలో అన్నమయ్య డ్యాం కు సంబందించిన సమస్య పై ఇప్పటికే బిజెపి కోర్టులో కేసు వేసింది. అదేవిధంగా బద్వేలు తదితర ప్రాంతాల్లో సమస్యల పై బిజెపి నేతలు అభియోగాలు నమోదు చేశారు.