Suryaa.co.in

National

ప్రధాని మోడీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న ఎంఐఎం

-ఒక్కసారి అవకాశం కల్పించండి
-బీజేపీ జాతీయ నాయకురాలు ఖుష్బు

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అమలుకానీయకుండా అడ్డుకుంటున్న ఎం ఐ ఎం కు తగిన గుణపాఠం చెప్పాలని బీజేపీ జాతీయ నాయకురాలు ఖుష్బు ధ్వజమెత్తారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఎం ఐ పార్టీకి చెందిన వాళ్లే అయినా పాతబస్తీని ఎందుకు అభివృద్ది చేయడం లేదని ప్రశ్నించారు. జులై 2,3 తేదీలలో జరుగనున్న బీజేపీ జాతీయసమావేశాల సందర్బంగా బీజేపీ జాతీయ నాయకురాలు ఖుష్బును చార్మినార్ నియోజక వర్గ ఇంచార్జిగా నియమించారు. ఈ సందర్బంగా చార్మినార్ శ్రీ భాగ్య లక్ష్మి దేవాలయాన్ని గురువారం ఆమె బీహార్ ఎంపీ రాధాసింగ్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఖుష్బు మాట్లాడుతూ పాతబస్తీ లో మీరు మీపిల్లలు అభివృద్ది చెందడం అసలు ఎం ఐ ఎం కు ఇష్టం లేదన్నారు. వాళ్ళ చెప్పు చేతల్లో మిమ్మల్ని అనగదొక్కదానికే ఎం ఐ ఎం కుట్ర పన్నుతుందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ అన్ని విధాలాదూసుకు పోతుందని, మాకు ఒక అవకాశం కల్పిస్తే తప్పకుండా సంక్షేమ పథకాలను అమలుచేయడంతో పాటు మీకు రక్షణ కల్పిస్తామన్నారు.

LEAVE A RESPONSE