ఆసుపత్రి పడకలపైనా జీఎస్టీ బాదుడు..

ఆసుపత్రి పడకలపై 5 శాతం జీఎస్టీని విధించడం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.5,000కు పైగా చార్జీ ఉండే పడకలకు ఇన్ పుట్ క్రెడిట్ ట్యాక్స్ సదుపాయం లేకుండా పన్నును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. పేదలు, మధ్యతరగతి వారిపై ఇది భారం మోపుతుందని, నాణ్యమైన వైద్యాన్ని దూరం చేయడం అవుతుందని పేర్కొంటున్నారు.

హెల్త్ కేర్ సంస్థల సమాఖ్య న్యాట్ హెల్త్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. ‘‘కీలకమైన వైద్య సేవలపై కేవలం నామమాత్రపు జీఎస్టీని విధించాలి. అదే సమయంలో హెల్త్ కేర్ సంస్థలు వినియోగించే ముడి వస్తువులపై జీఎస్టీని తగ్గించాలి. అప్పుడు నాణ్యమైన వైద్య సేవలు మరింత అందుబాటు ధరలకు వస్తాయి’’ అని సూచించారు.

దేశంలో హెల్త్ కేర్ సేవలను జీఎస్టీ కిందకు తీసుకురావడం ఇదే మొదటిసారి. రెండు రోజుల క్రితం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కౌన్సిల్ నిర్ణయం మధ్యతరగతి వాసులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రుల ఆదాయంపైనా ప్రభావం చూపిస్తుందన్నారు.

Leave a Reply