Suryaa.co.in

Editorial

షుక్రియా మోదీ సాబ్..

– ముస్లిం మహిళల సలామ్
– ముస్లింల ఓట్లే కీలకం!
– 38 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లే ప్రధానం
– అక్కడ 40 వేల నుంచి 80వేల ఓటర్లు
– రాయలసీమలోనే అధికం
– కోస్తాలో తక్కువే
– మరికొన్ని చోట్ల 30 వేలు
– ముస్లిం మహిళా ఓటర్లే ఎక్కువ
– వారిపై త్రిబుల్ తలాక్ ప్రభావం ఎక్కువే
– త్రిబుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళల్లో మోదీకి సానుకూలత
– తలాక్ రద్దుతో తమ జీవితాలకు మోదీ భద్రత కల్పించారన్న భావన
– తెలంగాణకు భిన్నంగా ఆంధ్రా ముస్లిములు
– విజయాన్ని శాసిస్తున్న ముస్లిం మైనారిటీ ఓటర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలోని కొన్ని కీలక నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీలు విజయాన్ని శాసిస్తున్నారు. ప్రధానంగా రాయలసీమలోని పలు నియోజకవర్గాల్లో, ముస్లిం ఓటర్ల సంఖ్య గణనీయంగా కనిపిస్తోంది. రేపటి ఎన్నికల్లో వారే విజయాన్ని నిర్దేశించనున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

రాయలసీమలోని కర్నూలు, కడప, నంద్యాల, ఆదోని, హిందూపురం, పీలేరు, మదనపల్లి వంటి నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య 50 వేల నుంచి 80 వేల వరకూ ఉండటం గమనార్హం. ఇక కోస్తాలో విజయవాడ వెస్ట్, గుంటూరు ఈస్ట్, ఒంగోలు, చిలకలూరిపేట, గుంటూరు వెస్ట్, నర్సరావుపేట, గురజాల వంటి నియోజవర్గాల్లో 25 నుంచి 37 వేల ఓట్ల వరకూ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

కాగా, వీరిలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటం ఆసక్తికరం. దానితో రేపటి ఎన్నికల్లో త్రిబుల్ తలాక్ నిర్ణయం సానుకూలంగా మారే అవకాశాలు లేకపోలేదు. నిజానికి మతవాదం- మతభావన విషయంలో తెలంగాణతో పోలిస్తే, ఆంధ్రాలో చాలా తక్కువ. ఏపీలో హిందు-ముస్లిములు కలసి జీవిస్తుంటారు. దాదాపు అన్ని పట్టణాలు, చివరకు మండల కేంద్రాల్లో కూడా హిందువులకు సంబంధించిన షాపులను, ముస్లిములు అద్దెకు తీసుకుని వ్యాపారాలు చేస్తుంటారు.

గ్రామాలు-మండల కేంద్రాల్లో అయితే, హిందువుల అరుగులమీదనే ముస్లిములు చేతివృత్తులు చేసుకుని జీవిస్తుంటారు. ఇక శ్రీశైలం, తిరుపతికి వెళ్లే ముస్లింల సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పైగా ఆంధ్రా ముస్లిం మహిళల్లో చదువుకున్న వారి సంఖ్య ఎక్కువ. ఈ సంఖ్య తెలంగాణలో తక్కువగానే ఉంటుంది. కర్నూలు వంటి అతి తక్కువ నగరాల్లోనే మత భావన-అప్పుడప్పుడూ ఉద్రిక్త పరిస్థితి కొద్దిగా కనిపిస్తుంటుంది.

ఈ నేపథ్యంలో త్రిబుల్ తలాక్ ప్రభావం, ఆంధ్రా మహిళలపై ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. త్రిబుల్ తలాక్ రద్దుతో మోదీ ప్రభుత్వం ముస్లిం మహిళల జీవితాల్లో వెలుగునింపింది. ఇది తమ జీవితాలకు భరోసా-భద్రత ఇచ్చిందన్న భావన ముస్లిం మహిళల్లో బలంగా నాటుకుపోయింది.

ముస్లిం పురుషులు ఎంతమందినయినా పెళ్లిచేసుకునే ఈ విధానానికి.. మోదీ ప్రభుత్వం తెరదించిన రోజు, దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలు రోడ్డెక్కి సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. దానితో రేపటి ఎన్నికల్లో ముస్లిం పురుషుల ఓట్లు రాకపోయినప్పటికీ, మహిళల ఓట్లు ఖాయంగా పడతాయన్న భరోసా బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రేపటి బీజేపీ ఎన్నికల ప్రచారంలో త్రిబుల్ తలాక్ ఒక అస్త్రం కానుంది.

ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలు.

విజయవాడ వెస్ట్ – 60000
గుంటూరు ఈస్ట్ – 70000
నెల్లూరు సిటీ – 60000
కర్నూలు – 90000
కడప – 80000
అనంతపురం అర్బన్ – 55000
నంద్యాల – 60000
ఆదోని – 70000
మదనపల్లి – 50000
ప్రొద్దుటూరు – 50000
చిత్తూరు – 25000
తెనాలి – 25000
మచిలీపట్నం – 20000
ఒంగోలు – 30000
హిందూపురం – 50000
గుంతకల్లు – 40000
కదిరి – 40000
రాయచోటి – 65000
తాడిపత్రి – 30000
చిలకలూరిపేట – 35000
నరసరావుపేట – 30000
నెల్లూరు రూరల్ – 30000
కావలి – 20000
ఉదయగిరి – 32000
ఆత్మకూరు – 31000
కోవూరు – 22000
బద్వేలు – 24000
పులివెందుల – 31000
కమలాపురం – 30000
జమ్మలమడుగు – 25000
మైదుకూరు – 27000
నందిగామ – 22000
జగ్గయ్యపేట – 21000
తాడికొండ – 23000
మంగళగిరి – 25000
పొన్నూరు – 26000
ప్రత్తిపాడు – 21000
గుంటూరు వెస్ట్ – 30000
పెనమలూరు – 25000
పెదకూరపాడు – 22000
సత్తెనపల్లి – 31000
వినుకొండ – 20000
గురజాల – 37000
మాచర్ల – 20000
బాపట్ల -20000
పర్చూరు -20000
మార్కాపురం – 20000
గిద్దలూరు – 27000
ఆళ్లగడ్డ – 40000
శ్రీశైలం – 42000
నందికొట్కూరు – 38000
పాణ్యం – 35000
బనగానపల్లె – 30000
డోన్ – 20000
ఎమ్మిగనూరు -27000
ధర్మవరం – 20000
రాజంపేట – 25000
తంబళ్లపల్లె – 25000
పీలేరు – 45000
మదనపల్లి – 45000
పుంగనూరు – 35000
చిత్తూరు – 22000
పలమనేరు – 3800

LEAVE A RESPONSE