Suryaa.co.in

Andhra Pradesh

ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కూటమి గెలుపు ఖాయం

-జగన్‌ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది
-ఎప్పుడో బటన్‌ నొక్కితే డబ్బులు ఎందుకు పడలేదు?

-బీజేపీ నేతలు పాతూరి, లంకా దినకర్‌, సాధినేని యామిని

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆ పార్టీ నేతలు బీజేపీ మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం, ప్రత్యేక అధికార ప్రతినిధి లంకా దినకర్‌, అధికార ప్రతినిధి సాధినేని యామిని విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

పాతూరి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌ అబద్ధాలు, అసత్యాలు, మాయలు ప్రజలకు అర్థమయ్యాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన మా అధ్యక్షురాలు పురందేశ్వరి, సుజనా చౌదరి వంటి నేతలపై దూషణలకు దిగాడు. పథకాలను కూటమి పార్టీ అడ్డుకుంటుందని కొత్త పల్లవి అందు కున్నాడు. రెండు నెలల క్రితం బటన్‌ నొక్కితే డబ్బులు రావడానికి రెండు నెలలు ఎందు కు పట్టింది? అని ప్రశ్నించారు. కొంతమంది అధికారులు జగన్‌ కోసం తమ అధికారాన్ని దుర్విని యోగం చేస్తున్నారు. అటువంటి వారు జాగ్రత్తపడాలని కోరారు. ప్రజల ఆస్తుల ను కొల్లగొట్టేందుకు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తెచ్చి కేంద్రం పెట్టిన ప్రతిపాదనలను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. రాజధానిని నాశం చేశాడు. విద్యుత్‌, ఆర్టీసీ చార్జీ లు పెంచాడు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించి జగన్‌ దళితులకు అన్యాయం చేశాడు. ఏపీని గంజాయి, డ్రగ్స్‌కు ప్రధాన కేంద్రంగా మార్చాడు. ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మాఫియా రాజ్యానికి కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. నవరత్నాలు బదులు 99 తప్పులు చేసిన జగన్‌ను ప్రజలు సాగనంపాలని పిలుపునిచ్చారు.

కేతిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి: లంకా దినకర్‌
రాష్ట్రంలో ఓడిపోతున్నామని తెలిసి వివాదాలు సృష్టించాలని కుట్ర చేస్తున్నారు. ధర్మవ రంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓటర్లను, ప్రతిపక్ష పార్టీల నేతలను బెదిరిస్తున్నారు. ఇటు వంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం.. దీనిపై చర్యలు తీసుకోవాలి. బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసే వారిపై దాడులు చేసి కొడుతున్నారు. 290 బూత్‌లు ఉంటే 248 బూత్‌లలో వెబ్‌ క్యామ్‌లు పెట్టే పరిస్థితి తెచ్చారంటే ధర్మవరం నియోజకవర్గంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఉద్యోగులు వైసీపీకి సమాధానం చెప్పారని జగన్‌కు అర్థమైంది. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో కేతిరెడ్డి వంటి వాళ్లే దోపిడీకి తెగబడతారు.

కేంద్రం నిధులు దారి మళ్లించారు: సాధినేని యామిని
రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక గాలి బలంగా వీస్తుంది. తప్పకుండా ఓటమి ఖాయమని జగన్‌ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. చెప్పిన అబద్ధాలు పదే పదే చెబుతూ మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. తమ వంతుగా ప్రజలకు వాస్తవాలు వివరిస్తున్నాం. కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇచ్చినా దారి మళ్లించారు. 3.45 లక్షల కోట్లు నిధులు కేంద్రం నుంచి ఇచ్చింది. వాటిని దేనికి వాడారో చెప్పే దైర్యం జగన్‌కు ఉందా. బటన్‌ నొక్కామని పదే పదే చెబుతున్న జగన్‌ ఆ డబ్బులో కేంద్రం షేర్‌ ఎంతో ఎందుకు చెప్పడం లేదు. మోదీ ఇచ్చిన నిధులతో పథóకాలు అమలు చేస్తూ జగన్‌ మాత్రం తన సొంత స్టిక్కర్‌ వేసుకోవడానికి సిగ్గుండాలి.

LEAVE A RESPONSE